ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త వాహనంలో వరాలమ్మ

ABN, First Publish Date - 2022-12-10T00:35:39+05:30

ఎస్సార్‌ ఆసరా పథకం లబ్ధి కోసం వేలిముద్ర వేయించేందుకు పేరం వరాలమ్మ అనే వృద్ధురాలిని ఆమె కోడలు ఇలా చెత్తను తరలించే రిక్షాలో యానిమేటర్‌ ఇంటివద్దకు తీసుకువెళ్లారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆమె, నడవలేని స్థితిలో ఉన్నారు. యాడికి మండలంలోని చిక్కేపల్లి గ్రామం వీరిది.

చెత్తను తరలించే రిక్షాలో వరాలమ్మను తీసుకువెళుతున్న పారిశుధ్య కార్మికుడు శ్రీరాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసరా వేలిముద్ర వేసేందుకు...

వైఎస్సార్‌ ఆసరా పథకం లబ్ధి కోసం వేలిముద్ర వేయించేందుకు పేరం వరాలమ్మ అనే వృద్ధురాలిని ఆమె కోడలు ఇలా చెత్తను తరలించే రిక్షాలో యానిమేటర్‌ ఇంటివద్దకు తీసుకువెళ్లారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆమె, నడవలేని స్థితిలో ఉన్నారు. యాడికి మండలంలోని చిక్కేపల్లి గ్రామం వీరిది. వరాలమ్మ డ్వాక్రా సంఘంలో ఉన్నారు. సంఘం సభ్యుల వేలిముద్రలను సేకరించేందుకు యానిమేటర్‌ సావిత్రమ్మ చిక్కేపల్లిలోని తన ఇంటివద్ద గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వరాలమ్మను అక్కడికి తీసుకువెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు శ్రీరాములు ఇలా సాయపడ్డాడు. చెత్తను తరలించే తన రిక్షాలో ఆమెను ఎక్కించుకుని, అర కి.మీ. దూరంలోని యానిమేటర్‌ ఇంటి వరకూ తీసుకువెళ్లాడు. నడవలేని స్థితిలో ఉన్నవారి వేలిముద్రల సేకరణ కోసం యానిమేటర్లు ఇంటివద్దకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. చెత్తను తరలించే వాహనంలో వృద్ధురాలిని తీసుకువెళ్లడం చూసి ఆవేదన వ్యక్తం చేశారు.

- యాడికి

Updated Date - 2022-12-10T00:35:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising