ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణం... ప్రమాదం

ABN, First Publish Date - 2022-01-22T05:35:29+05:30

మండలంలోని హంపాపురం నుంచి కందూకూరుకు వెళ్లే దారిలో ప్రమాదం పొంచి ఉంది.

నీటిలో... రాళ్లలో ఇబ్బందులు పడుతూ వెళుతున్న వానదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాప్తాడు, జనవరి 21: మండలంలోని హంపాపురం నుంచి కందూకూరుకు వెళ్లే దారిలో ప్రమాదం పొంచి ఉంది. ఆ దారిలో నిర్మించిన కల్వర్టు పగిలిపోవడంతో రాళ్లు, గుండ్లతో ప్రయా ణానికి చాలా ఇబ్బందికరంగా మారింది. పీఏబీఆర్‌ కుడి కాలువ నీరు పిల్ల కాలువ ద్వారా కందుకూరు చెరువుకు కల్లర్టు మీదుగా వెలుతున్నాయి. రాళ్లు, గుండ్లతో ఉన్న కల్వర్టుపై ప్రవహించే నీటిలో ద్విచక్రవాహనదారులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ద్విచక్రవాహనాలు రోడ్డు దాటేందుకు కష్టతరంగా ఉంది. కొంత మంది వాహనదారులు రోడ్డు దాటే సమయంలో అదుపుతప్పి నీళ్లలో కింద పడుతున్నారు. అతి కష్టం మీద రోడ్డు దాటుతున్నారు. అధికారులు స్పందించి కల్వర్టు నిర్మించాలని కోరుతున్నారు.

ప్రమాదకరంగా గుంత 

మండలంలోని గాండ్లపర్తి ఉన్నత పాఠశాల ఎదుట రోడ్డును ఆనుకుని ఉన్న గుంత ప్రమాదకరంగా ఉంది. తాగు నీటి పైపులైను పగిలిపోవడంతో ఇటీవ లే రోడ్డుపై నాలుగు అడుగుల గుంత తవ్వారు. దానిని పూడ్చివేయకుండా అలాగే వదిలేశారు. దీం తో నడి రోడ్డుపై గుంత అలాగే ఉంది. ఆ దారి గుండా నిత్యం బస్సులు, టమోటా మండీలోకి వెళ్లే నాలుగు చక్రాల వాహనాలు వెళుతుంటాయి. గుంత అలాగే ఉంటే ప్రమాదాలు జరిగే అవ కాశం ఉందని అధికారులు స్పందించి గుంత పూడ్చివేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-01-22T05:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising