ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీ నిశాంతకుమార్‌ బదిలీ

ABN, First Publish Date - 2022-01-22T06:19:02+05:30

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ ) నిశాంతకుమార్‌ బదిలీ అయ్యా రు. గుంటూరు మున్సిపల్‌ కా ర్పొరేషన కమి షనర్‌గా ఆయన్ను బదిలీ చేశారు.

నూతన జేసీ కేతన గార్గ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన జేసీగా కేతన గార్గ్‌ నియామకం 

అనంతపురం వ్యవ సాయం, జనవరి 21 : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ ) నిశాంతకుమార్‌ బదిలీ అయ్యా రు. గుంటూరు మున్సిపల్‌ కా ర్పొరేషన కమి షనర్‌గా ఆయన్ను బదిలీ చేశారు. రాజస్థాన రాష్ట్రం జోధ్‌పూర్‌ నిశాంతకుమార్‌ స్వస్థ లం. 2014 ఐఏఎస్‌ బ్యాచకు చెందిన ఆయన రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ గా విధులు నిర్వర్తిస్తూ 2020 ఏప్రిల్‌ రెండో వారంలో జిల్లా జేసీగా బదిలీపై వచ్చారు. కొవిడ్‌ తొలి, రెండో వేవ్‌ సమయాల్లో జిల్లా యం త్రాంగం తరఫున తనదైన శైలిలో పని చేశారు. జిల్లా ఆక్సిజన పర్యవేక్షణ అధికారిగా ఆయన విధులు నిర్వర్తించారు. రైతు భరోసా,  రెవెన్యూ అంశాల తో పాటు కలెక్టర్‌ అప్పగించిన పలు రకాల పనులను పర్యవేక్షించారు. అలాగే కడప జిల్లా రాజంపేట సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేతన గార్గ్‌ను జిల్లా జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా బదిలీ చేశారు. 2018 ఐఏఎస్‌ బ్యాచకు చెందిన ఆయన రాజస్థాన వాసి. సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ఉద్యోగోన్నతిపై జిల్లా జేసీ గా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. మరో నాలుగు  రోజుల్లో నూతన జేసీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు కలెక్టరేట్‌ వర్గాల ద్వారా తెలిసింది. 



Updated Date - 2022-01-22T06:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising