ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు విజయదశమి

ABN, First Publish Date - 2022-10-05T04:57:51+05:30

తెలుగువారి ప్రధాన పండుగల్లో ఒకటైన విజయదశమిని బుధవారం ఉమ్మడిజిల్లా వాప్తంగా జరుపుకోనున్నారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని రోజుకొక అలంకారంలో పూజించిన తర్వాత విజయదశమినాడు దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది

పూజాసామగ్రిని కొనుగోలు చేస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 4: తెలుగువారి ప్రధాన పండుగల్లో ఒకటైన విజయదశమిని బుధవారం ఉమ్మడిజిల్లా వాప్తంగా జరుపుకోనున్నారు.  ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ.  తొమ్మిది రోజులపాటు అమ్మవారిని రోజుకొక అలంకారంలో పూజించిన తర్వాత విజయదశమినాడు దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రోజులు 9 రూపాల్లో యుద్ధం చేసి, అతడిని వధించిన సందర్భంగా 10వ రోజున ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకుంటారు. అదే విజయదశమి. విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం పండుగ సరుకుల కొనుగోళ్లు, ప్రజల షాపింగ్‌లతో నగరమంతా కిటకిటలాడింది. పూలు, పండ్లు, మామిడాకులు, టెంకాయలు, అరటి పిలకలు తదితర సామగ్రి కోనుగోళ్ల నేపథ్యంలో పాతూరులోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  మంగళవారం ఉదయం ఆయుధపూజ సందర్భంగా వాహనాలు, యంత్రాలతోపాటు వ్యవసాయ పరికరాలకూ పూజలు నిర్వహించారు.


Updated Date - 2022-10-05T04:57:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising