ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదికి మూడు సూత్రాలు

ABN, First Publish Date - 2022-07-04T06:04:55+05:30

కోర్టుల్లో పనిచేసే న్యాయవాది విధిగా మూడు సూత్రాలను పాటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీవీ నాగరత్న పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు జడ్జి నాగరత్నమ్మకు మెమెంటో అందజేస్తున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీవీ నాగరత్న

కదిరిలీగల్‌, జూలై 3: కోర్టుల్లో పనిచేసే న్యాయవాది విధిగా మూడు సూత్రాలను పాటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీవీ నాగరత్న పేర్కొన్నారు.  స్థానిక ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం కదిరికి వచ్చిన న్యాయ మూర్తి.. న్యాయవాదుల సంఘం ఆహ్వానంపై సంఘం కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లింగాల లోకేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి అత్యంత విలువైనదనీ,, పవిత్రమైనదని పేర్కొన్నారు. న్యాయవాది మొదట తనవద్దకు వచ్చే క్లయింట్లను తప్పక గౌరవించాలన్నారు. అలాగే కోర్టును, సమాజాన్ని గౌరవించాలన్నారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎనవీ రమణ అమలు చేసిన సంస్కరణల వల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థాన మైన సుప్రీంకోర్టుకు మహిళా న్యాయమూర్తి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. అనం తరం న్యాయమూర్తిని సన్మానించి, మొమెంటోలు అందించారు. కార్యక్రమంలో ఉమ్మ డి జిల్లా న్యాయమూర్తి జీ శ్రీనివాస్‌, సీనియర్‌ న్యాయవాదులు వేణుగోపాల్‌శర్మ, సుబ్బరాజుగుప్తా, లోకేశ్వర్‌రెడ్డి, బార్‌కౌన్సిల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు అలూరు రామిరెడ్డి, స్థానిక న్యాయమూర్తులు వెంకటేశ్వరరావు, ప్రతిమ, న్యాయవాదులు సత్యనారాయణ గుప్తా, వెంకటేష్‌, సురేంద్ర, భైరవప్రసాద్‌, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T06:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising