ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ABN, First Publish Date - 2022-06-07T06:24:50+05:30

మండలంలోని బ్రాహ్మణపల్లిలో యు వకుడు మూర్తి (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘ టన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.

ఉరికి వేలాడుతున్న మూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్య చేశారంటూ మృతదేహంతో బంధువుల ఆందోళన


సోమందేపల్లి, జూన 6: మండలంలోని బ్రాహ్మణపల్లిలో యు వకుడు మూర్తి (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘ టన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. బా ధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. నరసప్ప, గంగరత్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు మూర్తి కొంతకాలంగా గ్రామ స మీపంలోని ప్రైవేట్‌ డెయిరీలో సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు. యథావిధిగా ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యాడు. ఉదయం డెయిరీలోనే తాడుతో ఉరివేసుకున్నట్లు డెయిరీ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని బ్రాహ్మణపల్లికి తీ సుకురాగా తల్లిదండ్రులు, బంధువులు డెయిరీ నిర్వాహకుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారే తమ బిడ్డను హతమార్చి ఆ త్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తరలించే ప్రసక్తే లేదని హిందూపురం-పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండానే మృతదేహాన్ని ఎలా తరలిస్తారని వారు పోలీసులను ప్రశ్నించారు. సీఐ వెంకటేశ్వర్లు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Updated Date - 2022-06-07T06:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising