ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ విద్యావ్యవస్థను పటిష్టపరచాలి

ABN, First Publish Date - 2022-05-24T06:09:53+05:30

మున్సిపల్‌ విద్యావ్యవస్థను పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య (ఏపీఎంఐఎఫ్‌)రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిసిద్ధార్థ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిసే్ట్రషన ప్రవీణ్‌కుమార్‌ను కోరారు.

డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిసే్ట్రషన ప్రవీణ్‌కుమార్‌ను కలిసిన ఏపీఎంఐఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ధర్మవరం, మే 23: మున్సిపల్‌ విద్యావ్యవస్థను పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య (ఏపీఎంఐఎఫ్‌)రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిసిద్ధార్థ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిసే్ట్రషన ప్రవీణ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు వారు సోమవారం విజయవాడలో ప్రవీణ్‌కుమార్‌ను కలిసి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను విన్నవించారు. ప్రధానంగా మున్సిపల్‌ విద్యావ్యవస్థ పర్యవేక్షణకు మున్సిపల్‌ యాక్ట్‌లోనే ఉన్న ఎడ్యుకేషన ఆఫీసర్‌ పోస్టు, నగరపాలక సంస్థలకు కేటాయించిన పదకొండు డిప్యూటీ ఎడ్యుకేషన ఆఫీసర్‌ పోస్టులను మంజూరుచేసి భర్తీ చేయాలని కోరారు. పర్యవేక్షణ పేరుతో పురపాలక ఉపాధ్యాయులకు మరోసారి అన్యాయం చేయరాదని సూచించారు. అలాగే స్థానిక సంస్థలైన మండల, జిల్లాపరిషతలలో పనిచేస్తున్న ఉన్నతపాఠశాల ప్రఽధానో పాధ్యా యులు డీడీఓలుగా ఉన్నా... మున్సిపల్‌ విభాగంలోని  ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీడీఓ అధికారాలు ఇవ్వకపోవడం అన్యాయమ న్నారు. అప్‌గ్రేడ్‌ చేసిన పాఠశాలలకు ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యా యుల పోస్టులను దశాబ్దాలుగా మంజూరు చేయకపోగా వ్యవస్థ పర్యవేక్ష ణ బాధ్యతలను ఇంకో స్థానిక సంస్థలోని వారికి అప్పగించాలనే విధానం విచారకరమన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిసే్ట్రషనను కలిసిన వారిలో పలు జిల్లాల రాష్ట్ర, జిల్లానాయకులు ఉన్నారు.ట

Updated Date - 2022-05-24T06:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising