ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్వత్రిక ఎన్నికలకు ఎమెల్సీ ఎన్నికలు రెఫరెండం

ABN, First Publish Date - 2022-10-02T05:00:47+05:30

జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండం లాంటివని పశ్చిమ రా యలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి 


హిందూపురం, అక్టోబరు 1: జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండం లాంటివని పశ్చిమ రా యలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని కనకదాస కల్యాణమండపంలో హిందూపురం నియోజకవర్గ టీడీపీ, అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు జగనమోహనరెడ్డి నిరుద్యోగులకు ముద్దులు పెట్టి మోసం చేశారని విమర్శించారు. దీంతో అధిక శాతం పట్టభద్రుల్లో జగన బాధితులేనన్నారు. వారందరినీ ఓటరు గా చేర్పించాల్సిన బాధ్యత మనదేనన్నారు. కర్ణాటకలో చదివినా హిందూపురంలో నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే పట్టభద్రుల ఓ టరుకు అర్హత ఉంటుందన్నారు. నియోజకవర్గంలో 20 వేలకు పైగా పట్టభద్రులుంటే, కేవలం 5 వేల మంది మాత్రమే ఓటరుగా ఉన్నారన్నారు. మిగిలిన వారిని చేర్పించాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ నాయకుడిపై ఉందన్నారు. ఎమ్మెల్సీగా తాను గెలిస్తే, రాయలసీమలో 38 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచినట్లేనన్నారు. వైసీపీ ప్రభుత్వం లో పథకాలు అందని వారి ఇళ్లలోని పట్టభద్రులను ఓటర్లుగా చే ర్పించాలన్నారు. 


అధికారులు ఓటు పత్రాలు తారుమారు చేస్తే కేం ద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. మరో 37 రోజు లు ఓటరుగా నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్‌ నరసింహయాదవ్‌, రాష్ట్ర కార్యదర్శు లు ఆర్‌ఎంఎస్‌ షఫీ, రామాంజినమ్మ, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, బీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, క న్వీనర్లు అశ్వర్థనారాయణరెడ్డి, జయప్ప, రమేష్‌, అమర్‌నాథ్‌, వెంకటరమణ, డైమండ్‌ బాబా, పరిమళ, తెలుగుయువత ప్రధాన కార్యద ర్శి శ్రీనివాసులు, బీసీ సెల్‌ రవీంద్రనాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-02T05:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising