ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములను రైతులకు వెనక్కివ్వాలి

ABN, First Publish Date - 2022-09-24T05:02:59+05:30

ప్రజల నుంచి సేకరించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయనపుడు తిరిగి వారికి వెనక్కిచ్చేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత ధ్వజమెత్తారు.

అభివాదం చేస్తున్న బృందాకరత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత

దేశరక్షణ భేరిలో ప్రభుత్వాలపై ధ్వజం

పుట్టపర్తి/పుట్టపర్తి రూరల్‌, సెప్టెంబరు 23: ప్రజల నుంచి సేకరించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయనపుడు తిరిగి వారికి వెనక్కిచ్చేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన దేశరక్షణ భేరి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకుముందు స్థానిక గణేష్‌ సర్కిల్‌ నుంచి హనుమాన కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. కమ్యూనిస్టులు, అంగనవాడీ, ఆశా కార్యకర్తలు తరలివచ్చారు. ఎర్ర జెండాలతో పట్టణవీధులు ఎరుపెక్కాయి. అనంతరం హనుమాన కూడలిలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సభ నిర్వహించారు. కార్యక్రమంలో బృందాకరత.. ‘సోదరసోదరీమణులారా...’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆమె అంగ్ల ప్రసంగాన్ని సీపీఎం నేత రాంభూపాల్‌ తెలుగులోకి అనువదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బృందాకరత ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపాన కంపెనీల ఏర్పాటుకు దళితుల నుంచి వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయలేదన్నారు. వైసీపీ అధికారం చేపట్టాక అక్కడ అభివృద్ధిని విస్మరించిందన్నారు. నిబంధనల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేయనుపుడు ఆ భూముల ను తిరిగి పేదలకు ఇవ్వాలని బృందాకరత డిమాండ్‌ చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లాను అభివృద్ధి చేయాలన్నారు. శాసనసభ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చించకుండా, అధికార, ప్రతిపక్షాలు పరస్పరం తిట్టుకోవడానికే పరిమితమయ్యాయన్నారు. అంగనవాడీ, ఆశావర్కర్లు వేతనాలు అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారన్నారు. సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబులు మాట్లాడుతూ మున్సిపల్‌, పంచాయతీ కార్మికులు, అంగనవాడీ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సత్యసాయి, శ్రీరామిరెడ్డి, తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలనీ, చేనేత పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేపాక్షి హబ్‌ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాల్సిందేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు సావిత్రి, బడా సుబ్బారెడ్డి, పెద్దన్న, దిల్షాద్‌, నరసింహులు, లక్ష్మీనారాయణ,శ్రీనివాసులు, గౌస్‌లాజం, బాబావలి, బ్యాళ్ల అంజి, వినోద్‌ కుమార్‌, ప్రవీణ్‌, సాంబశివ, పైపల్లి గంగాధర పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising