ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-12-07T23:46:37+05:30
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఒక్కఅవకాశం కల్పించినందుకు ప్రజలపై అదనపు భారాలు మోపి, నడ్డివిరుస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు.
గాండ్లపెంట, డిసెంబరు 7: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఒక్కఅవకాశం కల్పించినందుకు ప్రజలపై అదనపు భారాలు మోపి, నడ్డివిరుస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. మండలపరిధిలోని గాజులవారిపల్లిపెద్ద తండా, నల్లగుట్టతండా, కల్లుబాయితండాల్లో బుధవారం వారు ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికెళ్లి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వం గోరంత పథకాలు అందించి ప్రజలనుంచి కొండత లాక్కుంటోందన్నారు. నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్, ఇసుక, విద్యుత, బస్స్ ఛార్జీలు, మద్యం ధరలు పెంచి ప్రజల నుంచి పీల్చి పిప్పి చేస్తోందన్నారు. రహదారుల మరమ్మతులు, పేదలకు ఇళ్లు కట్టించిన దాఖలాలు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించే సంక్షేమపథకాలు కనుమరుగైనట్లు విమర్శించారు. అనంతరం ఇదేం ఖర్మ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇనచార్జ్ నర్సిరెడ్డి, కన్వీనర్ కొండయ్య, మాజీ సర్పంచ ప్రసాద్, సర్పంచ శివప్పనాయుడు, కృష్ణనాయక్, ఆంజి, తాజుద్దీన, మాజీ ఎంపీపీ గంగరాజు, రమణనాయక్, చంద్ర, దాసిరెడ్డి, పవన, రవి, కార్యకర్తలు తదితరులున్నారు.
Updated Date - 2022-12-07T23:46:40+05:30 IST