ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు,చేనేతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2022-10-18T05:09:04+05:30

వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, చేనేతలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైం దని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

ఽధర్మవరం, అక్టోబరు 17: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన  రైతులు, చేనేతలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైం దని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన సోమవారం తన వ్యక్తిగత కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు నెలలుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపో యారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే మగ్గాల గుంతల్లోకి నీరు చేరడంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పో యారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన రైతులకు ఇనపు ట్‌ సబ్సిడీతోపాటు నష్టపరిహారం కూడా అందించామని, చేనేతలకు జీవనభృతి కింద రూ.5వేలు అందించామన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వారికి ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.  పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు, చేనేత కార్మికులకు నెలకు రూ.15 వేలు తక్షణమే అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. అలాగే టీడీపీ హయాంలో తాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నితినగడ్కారి  సహకారంతో 386 కిలోమీటర్లు మట్టిరోడ్లు, తారురోడ్లు వేశామన్నారు. ఇప్పుడు ఒక సెంటీమీటర్‌ తారురోడ్డు కూడా వేయలేదన్నారు. సీఎంజగన రాష్ట్రాభివృద్ధిని మరచి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని విమర్శించారు. ఇక ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి రూ. వేలకోట్లు సంపాదించారే కానీ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డిష్‌రాజు, చిగిచెర్ల అరవిందరెడ్డి, పామిశెట్టిశివశంకర్‌, రాప్తాటి రాము, బోడగల గిరిధర్‌, నబీరసూల్‌, గొట్లూరు చంద్ర, నారాయణస్వామి పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T05:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising