ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంగార్డుల విధులు కీలకం

ABN, First Publish Date - 2022-12-07T01:14:25+05:30

పోలీసు శాఖలో హోంగార్డుల విధులు, సేవలు కీలకమని ఎస్పీ ఫక్కీరప్ప కొనియాడారు. జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయుధ హోంగార్డు ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు.

గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, డిసెంబరు 6: పోలీసు శాఖలో హోంగార్డుల విధులు, సేవలు కీలకమని ఎస్పీ ఫక్కీరప్ప కొనియాడారు. జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయుధ హోంగార్డు ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. 1963లో ఆవిర్భవించిన హోంగార్డు వ్యవస్థ పోలీస్‌ శాఖలో కీలకంగా మారిందని అన్నారు. సాధారణ విధులు మొదలు క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. హోంగార్డుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది హోంగార్డు కుటుంబాలకు అందించిన సాయాన్ని వివరించారు. ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద హోంగార్డులుగా నియమించామని పేర్కొన్నారు. అనంతరం హోంగార్డుల స్పోర్ట్స్‌మీట్‌ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు, డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐలు శివరాముడు, కత్తి శ్రీనివాసులు, జాకీర్‌హుస్సేన, రవిశంకర్‌రెడ్డి, మోహన, రాము, ఎస్‌ఐలు సుధాకర్‌ యాదవ్‌, శ్రీనివాసులు, వంశీకృష్ణ, ఆర్‌ఎ్‌సఐలు రాజశేఖర్‌రెడ్డి, మగ్బూల్‌, ప్రదీ్‌పసింగ్‌, రమే్‌షనాయక్‌, బాలాజీనాయక్‌, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్‌, హోంగార్డులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising