ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కదిరిలో రోజంతా ఉద్రిక్తం

ABN, First Publish Date - 2022-04-24T06:33:27+05:30

మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య లాడ్జి స్వాధీ నానికి వైసీపీ నాయకుల దౌర్జన్యంతో కదిరిలో రోజంతా ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి.

జొన్నా లాడ్జి ఎదుట వేసిన బండరాళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి, ఏప్రిల్‌ 23: మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య లాడ్జి స్వాధీ నానికి వైసీపీ నాయకుల దౌర్జన్యంతో కదిరిలో రోజంతా ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. ఉదయం 7 గంటలకే కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి అనుచరులు, వైసీపీ నాయకులు సాయిరాం భాస్కర్‌రెడ్డి, ఆయన అల్లు డు శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన అజ్జుకుంటి రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ నాయకుడు మధుకర్‌రెడ్డి.. వందలాదిమందితో లాడ్జి వద్దకు చేరుకుని, దౌర్జన్యానికి దిగారు. లాడ్జి ముందు బండరాళ్లు అడ్డుగా పెట్టారు. లాడ్జి లోపలికి చొరబడేందుకు యత్నించారు. భయానక వాతావరణం సృష్టిం చారు. అనంతరం జొన్నా రామయ్య ధర్నాకు దిగారు. మధ్యాహ్నం  మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ లాడ్జి వద్దకు వస్తున్నారన్న సమాచారంతో కదిరి సబ్‌ డివిజనకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బం ది పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో నియోజకవ ర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. అప్పటికే వైసీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు అక్కడ ఉన్నారు. ఈనేపథ్యంలో ఎప్పు డు ఏం జరుగుతుందోనని పోలీసులు, ప్రజలు ఆందోళన చెందారు.

అధికార పార్టీ దౌర్జన్యాలను సహించం 

 అధికార పార్టీ బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలపైన దౌర్జన్యం చేస్తే సహించమని మాజీ ఎమ్మెల్యే,  టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్ర సాద్‌ హెచ్చరించారు. పట్టణంలోని జొన్నాలాడ్జ్‌లో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్యతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ జొన్నా కుటుం బానికి జిల్లాలో ఓ ప్రత్యేకత ఉందని, అన్నదమ్ముల మధ్య ఉన్న బలహీనత లు, ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకొని, వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారని అన్నారు. ప్రైవేట్‌ ఆస్తులపై దౌర్జన్యం చేసి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. బలహీన వర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య లాడ్జ్‌ను ఆక్రమించుకోవడానికి అధికా ర పార్టీకి చెందినవారు లాడ్జ్‌ ఎదుట బండరాళ్లు వేసి, దౌర్జన్యం చేశారని పేర్కొన్నా రు. కోర్టులో స్టే ఉన్నా, లెక్కచేయకుండా దౌర్జన్యానికి పాల్పడడం అధికార పార్టీ అకృత్యాలకు పరాకాష్ట అన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సి న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించడమేనని అన్నారు. ఒక ఆస్తి వివాదం కోర్టు పరిధిలో ఉన్న ఉంటే, బాధితుడిని పరి రక్షించాల్సిన పోలీసులు మరిన్ని బండరాళ్లు వేయిస్తామని చెప్పడం సిగ్గుచే టన్నారు. ప్రైవేట్‌ ఆస్తులైనా బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగి నపుడు వారి పక్షాన టీడీపీ పోరాడుతుందన్నారు. జొన్నారామయ్య కుటుం బంలో ఉన్న తగాదాలను ఆసరా చేసుకొని అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తే సహించమన్నారు. మాజీ ఎమ్మెల్యేకే ఈ దుస్థితి ఉంటే, సామాన్య ప్రజలపై అధికారపార్టీ నాయకుల ఆగడాలు ఎలా ఉం టాయోనని ప్రశ్నించారు. పోలీసులు చట్టాన్ని పరిరక్షించాలని సూచించారు. జొన్నా కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని వారు తెలిపారు.  

రాజీ కుదిరిందా...? 

మాజీ ఎమ్మెల్యే జొన్నారామయ్య లాడ్జ్‌ వ్యవహారం శనివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు సాగింది. శ్రీధర్‌రెడ్డి, రామయ్యతో మాజీ ఎమ్మెల్యే కం దికుంట వెంకటప్రసాద్‌ చర్చలు చేశారు. చివరకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. లాడ్జ్‌ ముందు ఉన్న బండరాళ్లు కూడా తొలగిస్తారని సమాచారం. లాడ్జ్‌ కా ర్యకలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇరువర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరిం చుకున్నట్లు తెలిసింది. 




Updated Date - 2022-04-24T06:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising