ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షం మిగిల్చిన కన్నీరు..

ABN, First Publish Date - 2022-05-23T07:03:06+05:30

మూడు రోజులుగా మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీరే మిగిల్చాయి. చేతికి వచ్చిన పంటంతా నీటిపాలైంది. రాగి, మొక్కజొన్న పంట లు కోతదశలో ఉండగా, వర్షం దెబ్బకు నేలవాలాయి.

జక్కేపల్లిలో నీట మునిగిన రాగి పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంటంతా నీటిపాలు.. రైతన్న కుదేలు


మడకశిర రూరల్‌,  మే 22: మూడు రోజులుగా మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీరే మిగిల్చాయి.  చేతికి వచ్చిన పంటంతా నీటిపాలైంది. రాగి, మొక్కజొన్న పంట లు కోతదశలో ఉండగా, వర్షం దెబ్బకు నేలవాలాయి. పూర్తిగా దెబ్బతిన్న పంట రైతున్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


రూ.1.50 లక్షలు నష్టపోయా..

రంగారెడ్డి, రైతు సీ కొడిగేపల్లి

భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట దెబ్బతినింది. రెం డు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశా. రూ.30 వేలు  ఖర్చువచ్చింది. పంట కోసిన పొలంలోనే కుప్పపోశా. అంతలోనే  భారీ వ ర్షాలు రావడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట కుళ్ళిపోయింది. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.


 రాగి పంట నేలపాలు..

హనుమంతరెడ్డి, రైతు, జక్కేపల్లి

చేతికి వచ్చిన రాగి పంట భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఎగువ ప్రాంతం నుంచి వంకలు, వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఆనీరు పొలాలగుండా వెళ్లింది. దీంతో రాగి పంట నేలకొరిగి  దెబ్బతింది. అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలి.


జలమయమైన అంగనవాడీ కేంద్రం 

రొద్దం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్‌ఎల్‌ కొత్తూరు పా ఠశాలలోకి వర్షం నీరు చేరింది. ప్రభుత్వ పాఠశాల, అంగనవాడీ సెంటర్‌ పక్కపక్కనే ఉన్నాయి. పాఠశాల ఆవరణం తగ్గు ప్రాం తంలో ఉండడంతో వర్షం నీరు భారీగా చేరింది. మోకాళ్లలోతు నీరు నిల్వ ఉన్నాయి. వారం రోజులుగా గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడానికి వీలులేకుండా పోతున్నదని అంగనవాడీ కార్యకర్తలు వాపోయారు. ఎదురుగా ఉన్న రోడ్డు ఎ త్తులో ఉండటంతో వర్షపు నీరు బయటకు వెళ్లకపోవడంతో ఇ బ్బందిగా మారింది. పాఠశాల చుట్టూ ఉన్న నీటిలోనే విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళుతున్నారు. చిన్న పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న విమర్శలు ఉన్నాయి. సం బంధిత అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2022-05-23T07:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising