ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కోనుప్పలపాడు గ్రామస్థులకు టీడీపీ అండగా ఉంటుంది : నారా లోకేష్

ABN, First Publish Date - 2022-08-26T19:17:18+05:30

Amaravathi: అనంతపురం జిల్లా కోనుప్పలపాడు గ్రామ సర్పంచ్ భర్త రామాంజనేయులును పోలీసులు హింసించడంపై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. కొంతమంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: అనంతపురం జిల్లా కోనుప్పలపాడు గ్రామ సర్పంచ్ భర్త రామాంజనేయులును పోలీసులు హింసించడంపై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. కొంతమంది పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకున్నారని విమర్శించారు. శాంతి భద్రతలు గాలికొదిలి టీడీపీ కార్యకర్తల తలలు పగలకొట్టడం, సామాన్యులను చిత్రహింసలకు గురిచేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.  


డీజీపీ స్పందించాలి

‘‘అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో టీడీపీ సర్పంచ్ భర్త రామాంజనేయులును యానిమేటర్‌గా రాజీనామా చేయాలని వైసీపీ (YSRCP) నేతలు బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో రామాంజనేయులుతో సహా మరో ఆరుగురు గ్రామస్థుల‌పై కేసులు బనాయించారు. స్వయంగా తాడిపత్రి డీఎస్పీ రంగంలోకి దిగి బోయ సామాజికవర్గానికి చెందిన నాగార్జున, సింహాద్రి‌తో పాటు మరో నలుగురు‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చేతి వేళ్ళు విరిగి రక్తం కారే వరకూ హింసించారు. గ్రామస్థుల‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ నాయకుల్లా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసుల‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నా. ’’

- నారా లోకేష్ 


Updated Date - 2022-08-26T19:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising