రోడ్లు ఊడుస్తూ తెలుగుయువత నిరసన
ABN, First Publish Date - 2022-01-13T06:00:33+05:30
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తోందని తెలుగు యువత నాయకులు జిల్లా కేంద్రంలో బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. టవర్‌క్లాక్ వద్ద మెయినబజార్‌లో రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు.
అనంతపురం వైద్యం, జనవరి12: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తోందని తెలుగు యువత నాయకులు జిల్లా కేంద్రంలో బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. టవర్‌క్లాక్ వద్ద మెయినబజార్‌లో రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. తెలుగుయువత నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం జగన హామీ ఇచ్చారన్నారు. మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగాలు భర్తీ చేయక నిరుద్యోగులను జగన మోసం చేస్తున్నారన్నారు. దీంతో నిరుద్యోగులు వయసు పెరిగి ఆందోళన చెందుతున్నారన్నారు. 2020- 21లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక 358 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారనీ, వారి తల్లిదండ్రుల కడుపుకోత సీఎం జగనకు తప్పక తగులుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగుయువత అనంత పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుధాకరయాదవ్, నాయకులు వెంకటప్ప, బాలాలోకేష్, బొమ్మినేని శివ, బండి పరశురాం, చిరంజీవి, రాధాకృష్ణ, ఓబులరెడ్డి, రాంబాబు, సరిపూటి శ్రీకాంత, నగేష్, వెంకటనాయుడు, హరి పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T06:00:33+05:30 IST