ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వం.. నష్టం..!

ABN, First Publish Date - 2022-12-07T00:02:35+05:30

అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. టమోటా ధరలు పాతాళానికి పడిపోవడంతో సర్వం నష్టపోతున్నాడు రైతు. పండించిన పంటను పొలంలోనే వదిలేస్తున్నాడు. లేదంటే తొలగించి రోడ్లపక్కన పడేస్తున్నాడు.

ధరలు లేక పొలంలోనే వదిలేసిన టమోటా పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దారుణంగా పడిపోయిన టమోటా ధర

పంటను పొలాల్లో, రోడ్డు పక్కన వదిలేస్తున్న రైతులు

అమడగూరు, డిసెంబరు 6: అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. టమోటా ధరలు పాతాళానికి పడిపోవడంతో సర్వం నష్టపోతున్నాడు రైతు. పండించిన పంటను పొలంలోనే వదిలేస్తున్నాడు. లేదంటే తొలగించి రోడ్లపక్కన పడేస్తున్నాడు. మండలంలో టమోటాను విరివిగా సాగు చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ధరలు పడిపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో వెయ్యి ఎకరాలకుపైగా టమోటాను సాగుచేశారు. ధరలు లేకపోవడంతో టమోటాను పొలాల్లోనే వదిలేయడం, మరికొంతమంది పశువులను వదిలేస్తున్న దుస్థితి నెలకుంది. ఎకరాలో పంట సాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. చేతికొచ్చిన టమోటాలను కోయలేక, కూలీలకు గిట్టుబాటు కాదని రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్‌కు తరలించాలంటే ఒక బాక్స్‌కు రూ.70 నుంచి రూ.80 ఖర్చు వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో 15 కేజీల బాక్స్‌ ధర రూ.30 నుంచి రూ.40లోపే పలుకుతోంది. రవాణా ఖర్చులు కూడా దక్కవన్న ఉద్దేశంతో పొలాల్లోనే వదిలేస్తున్నట్లు రైతులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

పశువులకు వదిలేశా..

రెండెకరాల్లో టమోటా సాగుచేశా. రూ.లక్షన్నరకుపైగా ఖర్చు వచ్చింది. పంట దిగుబడి బాగా ఉన్నప్పటికీ ధరలు లేక, పశువులకు వదిలేశా. ఇప్పటివరకు ఒక కోత కూడా కోయలేదు. దీంతో రూ.ఒకటిన్నర లక్ష నష్టపోయా. టమోటాకు ధరలు లేకపోవడంతో కోత కోసిన కాయలను రోడ్డుపక్కనే పడేశా. ప్రభుత్వం శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధరలు కల్పించాలి.

- రామచంద్ర, గంగిరెడ్డిపల్లి

రవాణా ఖర్చులు కూడా రావడంలేదు..

మూడెకరాల్లో టమోటా సాగు చేశా. రూ.3లక్షలకుపైగా పెట్టుబడి పెట్టా. పంట కోతకొచ్చింది. మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయి. ఆ రేటుకు అమ్మితే వచ్చే డబ్బు.. రవాణా ఖర్చులకే సరిపోతుంది. కూలీల ఖర్చులు, కమిషన చేతినుంచి పెట్టుకోవాల్సిందే.

- రామస్వామి, ఎ.కొత్తపల్లి

Updated Date - 2022-12-07T00:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising