హెచఎంపై చర్యలు తీసుకోండి
ABN, First Publish Date - 2022-12-15T23:55:36+05:30
మండల కేంద్రం లోని ప్రాథమిక పా ఠశాల 3,4,5 తరగతుల వి ద్యార్థులను ఉన్నత పాఠ శాలలో చేర్చు కుని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రధానోపాధ్యాయురాలే, వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని, ఆ ప్రధానో పాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఎంఈఓ చాముండేశ్వరికి టీఎనఎస్‌ఎఫ్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
టీఎనఎస్‌ఎఫ్ నాయకుల డిమాండ్
బత్తలపల్లి, డిసెంబరు 15: మండల కేంద్రం లోని ప్రాథమిక పా ఠశాల 3,4,5 తరగతుల వి ద్యార్థులను ఉన్నత పాఠ శాలలో చేర్చు కుని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రధానోపాధ్యాయురాలే, వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని, ఆ ప్రధానో పాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఎంఈఓ చాముండేశ్వరికి టీఎనఎస్‌ఎఫ్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బత్తలపల్లిలోని సౌతజోన పాఠశాల 3, 4, 5తరగతుల విద్యార్థులను బాలుర ఉన్నతపాఠశాలలో విలీనం చేసినప్పటీకి, అక్కడ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను పాఠశాలలోకి చేర్చుకోవడం లేదన్నారు. పాఠశాలలో వసతులు ఉన్నప్పటీకి విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాగే కాలాయాపన చేస్తే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వెళ్లి తహసీల్దార్ లేకపోవడంతో సీఎస్‌డీటీ శారదకు వినతిపత్రం ఇచ్చారు. టీఎనఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, అధికారప్రతినిది ప్రతాప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇర్షాద్, హరి, వినోద్, ఐటీడీపీ హరి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:55:38+05:30 IST