ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిపాహిమాం..

ABN, First Publish Date - 2022-10-02T05:02:10+05:30

శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి శనివారం పరమపదనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి, అక్టోబరు 1: శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి శనివారం పరమపదనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన ఖాద్రీశుడు పరమపదనాథ అలంకరణలో కనువిందు చేశారు. ఆలయం అర్చకులు శ్రీవారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ, ఈఓ పట్టెం గురుప్రసాద్‌, సభ్యులు పాల్గొన్నారు. కాగా స్వామివారు ఆదివారం సాయంత్రం సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిస్తారు. 


దేవేరులకు బంగారు మాంగళ్యాలు

కదిరి: శ్రీదేవి,భూదేవి సమేత ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి నల్లమాడ మండలం వేళ్లమద్దికి చెందిన సైకం శ్రీనివాసులు రెడ్డి శనివారం రూ.20 లక్షలు విలువ చేసే 37 తులాల బంగారు తిరుమాంగళ్యాలను కానుకగా సమర్పించారు.  శ్రీవారికి మొక్కుబడిలో భాగంగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు 370 గ్రాముల తిరుమాంగళ్యాలను ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్‌, పాలకమండలి చైర్మన జెరిపిటి గోపాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా సైకం శ్రీనివాసులు రెడ్డి, ఆయన సతీమణి బిందురెడ్డి, కుటుంబ సభ్యులు టీడీ చెన్నారెడ్డి, పద్మ తదితరులను  రంగమండపంలో సత్కరించి శ్రీవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కె.నరసింహాచార్యులు, ఏడీ పార్థసారథిచార్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising