ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పు కంతు బ్యాంకుకు కట్టకుండా సొమ్ము స్వాహా

ABN, First Publish Date - 2022-01-22T05:47:22+05:30

స్వయం సహాయక సంఘాల మహిళల అవగాహనాలోపం కొందరు వెలుగు పథకం సిబ్బందికి ఆదాయవనరుగా మారుతోంది.

ఆధారాలు చూపుతున్న గ్రామస్థుడు శివకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గుండ్లపల్లి మహిళా సంఘాల్లో వెలుగు చూసిన అవినీతి 


బెళుగుప్ప, జనవరి 21: స్వయం సహాయక సంఘాల మహిళల అవగాహనాలోపం కొందరు వెలుగు పథకం సిబ్బందికి ఆదాయవనరుగా మారుతోంది. మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో పొదుపు సంఘాలలో లక్షల్లో అవి నీతి జరిగినట్లు వెలుగుచూసింది. మహిళాల స్ర్తీనిధి నుంచి తీసుకున్న అప్పులకు కం తులువారిగా కడుతున్న నగదును బ్యాంక్‌కు జమచేయకుండా కాజేస్తున్నట్లు తేలింది.  కా యకష్టం చేసి ప్రతినెలా తీసుకున్న అప్పునకు కంతు కడుతున్నా ఇంకా బకాయి ఉన్నట్లు మెసేజ్‌ రావడంతో అనుమానం వచ్చి బ్యాంకు ఉద్యోగులను ఆరాతీయగా జమచేయకుండా కాజేసినట్లు తేలింది. గ్రామానికి చెందిన శివకుమార్‌ ఆ నలైన రికార్డులను పరిశీలించగా గ్రామంలో 17 మహిళా సంఘాలుండగా రూ.7.11లక్షలు దోచుకున్నట్లు తేలింది. అవినీతి బాగోతం బయటపడటంతో గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసిన నగదును బ్యాం కుకు జమ చేస్తున్నారు. గీతాంజలి సంఘానికి రూ.2లక్షలు రుణం మంజూరుకాగా రూ.లక్ష మంజూరైందని మోసం చేశాడు. మొక్కజొన్న పంట కొనుగోలు కు వెలుగు పథకం ద్వారానే ఖాళీ బస్తాలు, రైతులు పంట కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో పొందుపరిచి రూ.లక్ష కాజేశారు. నిబంధనలు గాలికొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆధారాలతో ఉన్నతాధికారులకు గ్రామస్థుడు శివకుమార్‌ ఫిర్యాదు చేయగా విచారణకు ఆ దేశించారు. వి చారణ జరగకుండా తొక్కి పెట్టేందుకు అధి కార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఈవిషయంమై ఏపీఎం మధుసూదన గుప్త వివరణ కోరగా విచారిస్తున్నామని బ్యాంకుకు జమచేస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2022-01-22T05:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising