ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచిన మాండస్‌ తుఫాన

ABN, First Publish Date - 2022-12-12T23:48:15+05:30

మాండస్‌ తుఫాన రైతులను న ట్టేట ముంచుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వాన, గాలు లు వీస్తుండడంతో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. హిందూపు రం ప్రాంతంలో చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. సుమారు వెయ్యి ఎకరాల్లోని పంట చేతికి అందకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేలకొరిగిన పంటలు

రైతుకు తీరని నష్టం

హిందూపురం, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన రైతులను న ట్టేట ముంచుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వాన, గాలు లు వీస్తుండడంతో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. హిందూపు రం ప్రాంతంలో చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. సుమారు వెయ్యి ఎకరాల్లోని పంట చేతికి అందకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. చాలాచోట్ల ఏపుగా పెరిగిన వరిపంట నేలపాలైంది. మొక్కజొన్న పంటకూడా చాలాచోట్ల కోత దశలో ఉంది. మరికొంతమంది రైతులు జొన్న కంకెను తొలగించి పొలాల్లోనే ఉంచారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న కంకులు కూడా త డుస్తున్నాయి. మరికొంతమంది రైతులు జొన్నకంకులు ఆడించి జొ న్నలు కుప్పగా పోశారు. ఎండ లేకపోవడంతో కుప్పల్లోనే మొలకలు వస్తున్నాయని రైతులు దిగాలు చెందుతున్నారు. నియోజకవర్గ వ్యా ప్తంగా చేతికొచ్చిన మొక్కజొన్న పంట సుమారు 2వేల ఎకరాల్లో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎండు మిర్చి కోసం వదిలేసిన మిరప పంటకు కూడా వర్షం వల్ల నష్టం చే కూరుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో ఆదివారం కురిసిన వర్షాలకు జయమంగళినది మరోసారి ప్రవహిస్తోంది. పెన్నానదికి కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T23:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising