ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి విద్యార్థీ స్టార్ట్‌పను ప్రారంభించాలి

ABN, First Publish Date - 2022-01-23T05:21:39+05:30

దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన పారిశ్రామిక రంగంలో ప్రతి విద్యార్థీ స్టార్ట్‌పను ప్రారంభించాలని రాష్ట్ర ఉ న్నత విద్యామండలి చైర్మన హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన హేమచంద్రారెడ్డి

ఎస్కేయూలో స్టార్టప్‌ జాతర  

అనంతపురం అర్బన, జనవరి 22: దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన పారిశ్రామిక రంగంలో ప్రతి విద్యార్థీ స్టార్ట్‌పను ప్రారంభించాలని రాష్ట్ర ఉ న్నత విద్యామండలి చైర్మన హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎస్కేయూ అటల్‌ ఇంక్యుబేషన సెం టర్‌ (ఏఐసీ)లో స్టార్టప్‌ జాతర నిర్వహించారు. ఏఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నాగభూషణ్‌ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన హేమచంద్రారెడ్డి, బ్లాక్‌చైన స్టాండర్స్‌ కమిటీ చైర్మన జేఏ చౌదరి, ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి వర్చువల్‌గా హాజరై స్టార్టప్‌ వేడుకలను ప్రారంభించారు. వీసీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి ఆలోచనలను వాణిజ్య రూపంలోకి మార్చాలన్నారు. వివిధ రంగాల్లో స్టార్ట్‌పలను ఆవిష్కరించేందుకు ఏఐసీ వారిధిలా పనిచేస్తోందన్నారు. అన్నిరంగాల నుంచి ఆవిష్కరణలకు ముందుకురావాలన్నారు. 11మంది విద్యార్థులు ఉత్తమ ఇన్నోవేషన, పది బెస్ట్‌ స్టార్టప్‌ ఎకానమీ ఎనేబుల్స్‌, 12 స్టార్టప్‌ అవార్డులను ఆందుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాబార్డు మేనేజర్‌ ఉషామధుసూదన, వెల్పినిటీ కంపెనీ యజమాని శ్రీకాంత, ఆర్‌జాస్‌ స్టీల్‌ కంపెనీ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తి, ఏఐసీ సీఈఓ శివకిరణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T05:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising