బెస్ట్ టీచర్‌గా శ్రీదేవి
ABN, First Publish Date - 2022-11-26T00:28:27+05:30
సోషల్ సబ్జెక్టు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శ్రీదేవి ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 మంది టీచర్లను ఎంపిక చేయగా... ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి విడపనకల్లు జడ్పీ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న కె.శ్రీదేవి ఎంపికయ్యారు
అనంతపురం విద్య, నవంబరు 25: సోషల్ సబ్జెక్టు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శ్రీదేవి ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 మంది టీచర్లను ఎంపిక చేయగా... ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి విడపనకల్లు జడ్పీ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న కె.శ్రీదేవి ఎంపికయ్యారు. ఏపీ సోషల్ టీచర్స్ ఫెడరేషన్, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా రాష్ట్రంలో సోషల్ సబ్జెక్టులో ఉత్తమ సేవలు అందించిన టీచర్లను అవార్డుతో సత్కరించడం ఆనవాయితీ. ఏటా నవంబరు 26వ తేదీ సాంఘిక శాస్త్ర దినోత్సవాన్ని, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వారిని సత్కరిస్తారు. శ్రీదేవికి పలువురు సోషల్ టీచర్లు, ఏపీ సోషల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు అభినందనలు తెలిపారు.
Updated Date - 2022-11-26T00:28:28+05:30 IST