ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీ ఆంజనేయం

ABN, First Publish Date - 2022-08-07T05:39:44+05:30

శ్రావణ మాసం రెండో శనివారం కసాపురంలో సీతారామ లక్ష్మణులు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు.

కసాపురంలో హనుమంత వాహనంపై సీతారామ లక్ష్మణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు/డి హీరేహాళ్‌/బొమ్మనహాళ్‌, ఆగస్టు 6: శ్రావణ మాసం రెండో శనివారం కసాపురంలో సీతారామ లక్ష్మణులు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆంజనేయస్వామివారి మూల విరాట్టును విశేషంగా అలంకరించారు. అభిషేకాలు, అర్చనలు చేశారు. సుప్రభాత  సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్‌పర్సన సుగుణమ్మ, ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. డి హీరేహాళ్‌ మండలంలోని మురడి ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, కుంకుమార్చన, బిల్వార్చన చేశారు. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఆలయానికి భక్తులు తరలివచ్చారు. బొమ్మనహాళ్‌ మండలంలోని నేమకల్లులో ఆంజనేయస్వామికి విశేష పూజలు జరిగాయి. వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణుపారాయణం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. పుష్పాలంకరణ చేసి నైవేద్యం సమర్పించారు. ప్రధాన అర్చకులు అనిల్‌ కుమార్‌ చార్యులు మహామంగళహారతి పట్టారు. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది తరలివచ్చారు. భక్తులకు అన్నదానం చేశారు.






Updated Date - 2022-08-07T05:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising