సంకల్ప సిద్ధి బాధితుల ఫిర్యాదుకు ప్రత్యేక సెల్
ABN, First Publish Date - 2022-12-16T00:07:29+05:30
కళ్యాణదుర్గం పట్టణ పోలీ్‌సస్టేషనలో సంకల్ప సిద్ధి బాధితులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ బీ శ్రీనివాసులు తెలిపారు.
బాధితులకు న్యాయం చేస్తాం: డీఎస్పీ
కంబదూరు (కళ్యాణదుర్గం), డిసెంబరు 15: కళ్యాణదుర్గం పట్టణ పోలీ్‌సస్టేషనలో సంకల్ప సిద్ధి బాధితులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ బీ శ్రీనివాసులు తెలిపారు. ఆంధ్రజ్యోతిలో ఈ నెల 4న ‘ఇప్పుడెలా..సంకల్ప సిద్ధి బాధితుల్లో దిగులు’.. 13న ‘నమ్మా రు...నమ్మించారు..మునిగిపోయారు’ అన్న శీర్షికన ప్రత్యే కథనాలు ప్రచురితం కావడంతో పోలీసులు స్పందించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. గురువారం కళ్యాణదుర్గం పట్టణ పోలీ్‌సస్టేషనలో సీఐ తేజోమూర్తి, టౌన ఎస్‌ఐ ఆశాబేగంతో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కళ్యాణదుర్గం టౌనలో నివాసం ఉంటున్న సూగేపల్లి నరేష్ రూ.3,16,000, ఉపాధ్యాయుడు గోవిందరాజులు రూ. ఐదు లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయారని తెలిపారు. వీరి ఇద్దరి ఫిర్యాదు మేరకు సంకల్ప సిద్ధి మార్ట్ కంపెనీ సీఎండీ గుట్టా వేణుగోపాల కృష్ణ, ఎండీ గుట్టా కిరణ్, కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన దూదేకుల కుళ్ళాయ స్వామిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో బాధితులు ఎవ్వ రైనా ఉంటే కళ్యాణదుర్గం పట్టణ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
Updated Date - 2022-12-16T00:07:30+05:30 IST