ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగళి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2022-09-25T05:10:20+05:30

మండలం కర్ణాటక సరిహద్దున ఉందని, గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జడ్పీటీసీ సభ్యుడు ఉమేష్‌ విన్నవించారు.

జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న ఉమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ సమావేశంలో టీడీపీ జడ్పీటీసీ ఉమేష్‌


అగళి, సెప్టెంబరు 24: మండలం కర్ణాటక సరిహద్దున ఉందని, గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జడ్పీటీసీ సభ్యుడు ఉమేష్‌ విన్నవించారు. శనివారం అనంతపురంలో నిర్వహిం చిన జడ్పీ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అగళి మండలం కర్ణాటక సరిహద్దులో ఉందని, దీంతో అధికారులు, పాలకులు చిన్నచూపు చూస్తున్నారన్నారు. 20 రోజుల క్రితం ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతంలో అధిక వర్షాలు కురిశాయన్నారు. దీంతో మండల పరిధిలోని సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహించి చెరువులు, కుంటలు ఏకమయ్యా యన్నారు. దీంతో పంట పొలాలు నీట మునిగాయని, వాగులు, వం కల ఉధృతికి పలుచోట్ల రహదారి వంతెనలు, కల్వర్టులు తెగిపోయాయని తెలిపారు. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింద ని, ఈవిషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. రామాపురం కల్వర్టు, ఇరిగేపల్లి, మధూడి, కొమరేపల్లి, హనుమనపల్లి గ్రామాల్లోని ప్రధాన రహదారిపై ఉన్న వంతెనలు తెగిపోయాయ న్నారు. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరా యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా 150 మంది వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు నలభై ఏళ్లుగా ప్రభుత్వ భూ ములను సాగు చేస్తున్నారని, ఇంతవరకు వాటికి పట్టాలు ఇవ్వలేదన్నారు. వెంటనే పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరా రు. మండలానికి వాల్టా చట్టాన్ని ఉపసంరించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలన్నారు. క్రాప్‌ ఇన్సూరెన్స, తాగునీటి ఎద్దడి, రెగ్యులర్‌ ఎంపీడీఓ, కొత్త విద్యుత సబ్‌స్టేషన నిర్మాణంపై సభ దృష్టికి తీసుకువెళ్లారు. గత జడ్పీ సమావేశంలోనూ పలు సమస్యలు విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేద ని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించి మండల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం పలు స మస్యలతో కూడిన వినతిపత్రాన్ని జడ్పీ చైర్‌పర్సనకు అందజేశారు. 


Updated Date - 2022-09-25T05:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising