ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్‌..! మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు

ABN, First Publish Date - 2022-12-15T00:12:22+05:30

కొందరు నాయకుల పేర్లతో చలామణి అవుతూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఎస్సీ సంక్షేమశాఖాధికారులు జేసీ కేతనగార్గ్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆ శాఖ అధికారులు పెనడౌన నిర్వహించి ఆ శాఖ కార్యాలయానికి తాళాలు వేశారు.

జేసీకి ఫిర్యాదు చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీకి ఫిర్యాదు చేసిన ఎస్సీ సంక్షేమశాఖాధికారులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 14: కొందరు నాయకుల పేర్లతో చలామణి అవుతూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఎస్సీ సంక్షేమశాఖాధికారులు జేసీ కేతనగార్గ్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆ శాఖ అధికారులు పెనడౌన నిర్వహించి ఆ శాఖ కార్యాలయానికి తాళాలు వేశారు. పెన్నార్‌ భవన నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీగా వెళ్లి జేసీకి ఫిర్యాదు చేశారు. ఆ శాఖ ఉద్యోగులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కార్యాలయంలో కొందరు నాయకులు తమకు సంబంధం లేని విషయాల్లో కలుగజేసుకొని ఇబ్బంది పెడుతున్నారన్నారు. రోజూ కార్యాలయానికి వచ్చి వారు చెప్పిన పని చేయకపోతే దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కూడా ఓ వ్యక్తి కార్యాలయంలోకి వచ్చి ఇష్టానుసారంగా అధికారులపై వ్యవహరించాడని ఫిర్యాదు చేశారు. డీడీ ఆధ్వర్యంలో అలాంటి వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జేసీ సూచించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ సూపరింటెండెంట్లు వెంకటలక్ష్మి, అన్వర్‌, ఏఎ్‌సడబ్ల్యూఓ దామోదర్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising