ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాల్లో యూరియా కొరత

ABN, First Publish Date - 2022-08-07T05:05:28+05:30

రైతులు ప్రస్తుత ఖరీఫ్‌లో సా గు చేసిన పంటలకు యూరియూ కొరత తీవ్రమైంది. రైతు భరోసా కేంద్రాల్లో సరాఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు.

యూరియా లేని హరేసముద్రం రైతు భరోసా కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర రూరల్‌, ఆగస్టు 6: రైతులు ప్రస్తుత ఖరీఫ్‌లో సా గు చేసిన పంటలకు యూరియూ కొరత తీవ్రమైంది. రైతు భరోసా కేంద్రాల్లో సరాఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. యూరియూ కోసం రైతులు ఆర్బీకేలకు వెళ్ళి, అక్కడ స్ఠాక్‌ లేక పోవడంతో నిరాశ తో వెనుతిరుగుతున్నారు. మండలంలో 18 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతులకు సత్వర సేవలు అందించడం కోసం ఆర్బీకేలను ఏర్పాటుచేశారు. ఈయేడు చాలామంది మండల రైతులు మొక్కజొ న్న పత్తి, మిరప, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేశారు.  వర్షా లు బాగా కురుస్తుండడంతో యూరియూ కోసం  రైతులు  ఆర్బీకే కేంద్రాల చూట్టు తిరుగుతున్నారు. అక్కడ స్ఠాక్‌ లేక పోవడంతో ని రాశతో వెనుతిరుగుతున్నారు. మరికొంత మంది రైతులు కర్ణాటక కు వెళ్ళి యూరియూను కోనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియూతో పాటు ఇతర ఎరువులు సరాఫరా చేయాలని కోరుతున్నారు.


కర్ణాటకకు వెళ్లి తీసుకువచ్చా..

హనుమంతరాయప్ప, రైతు, జిల్లేడగుంట 

మొక్కజొన్న పంట సాగు చేశా. వర్షాలతో పంట ఆశాజనకంగా ఉంది. యూరియూ కోసం కర్ణాటక వెళ్ళి తీరుకు వచ్చా. గ్రామంలోని ఆర్బీకే చుట్టూ తిరిగానా, అక్కడ స్ఠాక్‌ లేదన్నారు. దీంతో కర్టాటకకు వెళ్లి అవసరమైన ఎరువులు తీసుకువచ్చా.


యూరియా కోసం ఇండెంట్‌ పెట్టాం..

వీరనరేష్‌, వ్యవసాయాధికారి 

ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో యూరియూ స్టాక్‌ లేదు.  ఇం దుకోసం కోసం ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టాం. రైతు భరోసా కేంద్రా లకు యూరియా చేరగానే రైతులకు అందజేస్తాం.


Updated Date - 2022-08-07T05:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising