ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేకపోతు రూ.80 వేలు

ABN, First Publish Date - 2022-07-06T06:20:11+05:30

ఓ మేకపోతు.. సాధారణంగా రూ.10 వేలకో.. రూ.15వేలకో అమ్ముడుపోతుంది. కదిరిలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం ఓ మేకపోతు ఏకంగా రూ.80వేలు ధర పలికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    ఓ మేకపోతు.. సాధారణంగా రూ.10 వేలకో.. రూ.15వేలకో అమ్ముడుపోతుంది. కదిరిలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం ఓ మేకపోతు ఏకంగా రూ.80వేలు ధర పలికింది. ఈనెల 10వ తేదీన బక్రీద్‌ పండుగ నేపథ్యంలో మార్కెట్‌లో గొర్రెలు, మేకలకు డిమాండ్‌ ఏర్పడింది. విపరీతమైన ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మార్కెట్‌ యార్డుకు పెద్దఎత్తున మేకలు, గొర్రెలను యజమానులు తీసుకొచ్చారు. కొనుగోలుదారులు కూడా భారీగా వచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో ఉంటున్న షబ్బీర్‌ రెండు సంవత్సరాలుగా మేపిన మేకపోతును అమ్మకానికి తీసుకొచ్చాడు. దీని ధర రూ.80వేలుగా చెప్పాడు. ఒంటిపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో ముస్లింలు ఈ మేకను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. పండుగ సందర్భంగా కుర్బానీ ఇవ్వడానికి ఇలాంటి మేకపోతును ఎంపిక చేసుకోవడం సంప్రదాయం. అందువల్లే ఈమేకపోతుకు భారీ డిమాండ్‌ ఏర్పడిందని యజమాని షబ్బీర్‌ తెలిపాడు.

కదిరి

Updated Date - 2022-07-06T06:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising