ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన షర్పొద్దీన్‌ బాబా ఉరుసు

ABN, First Publish Date - 2022-01-28T05:56:17+05:30

మండల కేంద్రంలోని కుమ్మరపేటలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న షర్పొద్దీన్‌ బాబా ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలుపుల, జనవరి 27: మండల కేంద్రంలోని కుమ్మరపేటలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న షర్పొద్దీన్‌ బాబా ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.   ఈ ఏడు కరోనా వలన సాంస్కృతిక కార్యక్రమాలు ఖవాలీ, హరికథలను రద్దు చేశారు.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. కమిటీ మత పెద్ద ఆముదుమియా మాట్లాడుతూ ఉరుసు మహోత్సవం ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేసిన పోలీసు , రెవెన్యూ శాఖలతో పాటు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, సర్పంచు, ఉపసర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. 

 చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్యే 

 షర్పొద్దీన్‌ బాబా ఉరుసు ఉత్సవంలో గురువారం ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి చాదర్‌ను సమర్పించారు. ఉరుసు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు దర్గా నిర్వాహకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి చాదర్‌ను పక్కీర్ల జల్సాతో దర్గా వద్దకు తీసుకెళ్లి సమర్పించారు. ప్రత్యేక చదివింపులు చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ మహ మ్మద్‌రఫీ, వైస్‌ ఎంపీపీ ఓబులేశ్వరి, సర్పంచు శ్రీలత, ఉపసర్పంచు డీకే బాబు, మాజీ సర్పంచులు ఫయాజ్‌, బీ సూర్యనారాయణరెడ్డి, కుర్లి శివారెడ్డి, గిరిధర్‌రెడ్డి, టోపీ రమణ, ప్రభువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T05:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising