ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీల్డ్‌ కవర్‌ ఆర్డర్స్‌...!

ABN, First Publish Date - 2022-12-16T00:00:22+05:30

విద్యాశాఖలో ఊహించినట్లే అడ్డగోలు బదిలీలు చేసేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఒక వైపు దరఖాస్తులు.. మరో వైపు ఉత్తర్వులు

- దొడ్డిదారి బదిలీలు 20 వరకూ ఉన్నాయట..

- జిల్లా విద్యాశాఖకు చేరిన ఉత్తర్వులు

- భగ్గుమంటున్న సగటు ఉపాధ్యాయులు

అనంతపురం విద్య, డిసెంబరు 15: విద్యాశాఖలో ఊహించినట్లే అడ్డగోలు బదిలీలు చేసేశారు. అయిన వారికి అగ్రతాంబూలం ఇచ్చి.. సీల్డ్‌ కవర్స్‌లో బదిలీ ఆర్డర్స్‌ ఇచ్చారు. జిల్లాకు గురువారం భారీగా దొడ్డిదారి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ సిఫార్సు బదిలీ ఉత్తర్వుల కోసం కొందరు ఎదురుచూశారు. జిల్ల్లా వ్యాప్తంగా 15 నుంచి 20వ వరకూ అడ్డగోలు సిఫార్సు బదిలీలు అయ్యాయని సమాచారం. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. వీటికి తలొగ్గిన విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు బదిలీలకు షెడ్యూల్‌ ఇచ్చారు. ఈ నెల 14 నుంచి ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, ముఖ్యంగా మహిళలు చాలా మంది ఉన్నారు. ఇన్నాళ్లు వేచి చూసినందుకైనా నగరానికి, పట్టణాలకు దగ్గర్లో వస్తాయని భావించారు. సీనియర్‌ ఉపాధ్యాయులు, నిజాయితీగా పనిచేసేవారి ఆశలపై నీళ్లు చల్లారు. తమకున్న పలుకుబడితో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను పట్టుకుని కొందరు ఉపాధ్యాయులు దొడ్డిదారిలో కావాల్సిన స్థానాలకు బదిలీలు చేయించుకున్నారు.

అంతా గోప్యం..

సిఫార్సు బదిలీలు భారీగా వస్తున్నాయని మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విద్యాశాఖ వర్గాలు, ఉపాధ్యాయ సంఘాలలో ఇదే హాట్‌ టాపిక్‌. ఈ క్రమంలో ఈ నెల 14న విజయవాడకు వెళ్లిన విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర శాఖ నుంచి సిఫార్సు బదిలీల ఆర్డర్స్‌ను సీల్డ్‌ కవర్లలో ఇచ్చినట్లు సమాచారం. వాటిని తీసుకొచ్చిన విద్యాశాఖ ఉన్నతాధికారులు అత్యంత గోప్యత చాటించారు. కానీ ఈ సమాచారం అందుకున్న ఆశావహులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే పడిగాపులు కాశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు సీల్డ్‌ కవర్‌ ఆర్డర్స్‌లో పేర్లు ఉన్న దొడ్డిదారి పంతుళ్లను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ పిలిచి వివరాలు అడిగారు. ‘ఎక్కడికి కోరారు..? ఎక్కడికి ప్లేస్‌ ఇచ్చారు...? మీరు కోరుకున్నచోట ఖాళీ లేదుగా.. మరేదైనా ఖాళీ ప్లేస్‌ ఇవ్వాలా ?’ అని అడిగారు. ఇలా సిఫార్సు పంతుళ్ల సేవలో గడిపారు. ఈ తతంగం అంతా అత్యంత గోప్యంగా సాగింది. పైగా ఏ ఒక్కరికీ ఈ వివరాలు లీక్‌ చేయొద్దని కింది స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అనంతపురం, బుక్కరాయసముద్రం, జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉన్న పాఠశాలలకు చాలా మంది బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు సమాచారం. విద్యాశాఖ, ప్రభుత్వం తీరుపై సగటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

తప్పులతడకగా టిస్‌

డీఈఓ ఆఫీ్‌సకు బాధితుల పరుగు

అనంతపురం విద్య, డిసెంబరు 15: బదిలీల దరఖాస్తుకు మరో 48 గంటలే గడువు. వివరాల్లో తప్పుల తడకలు. చాలామంది టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాలల నుంచి డీఈఓ ఆఫీ్‌సకు గురువారం భారీ సంఖ్యలో టీచర్లు వచ్చారు. టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(టి్‌స)లో తమ వివరాలు తప్పులతడకగా ఉన్నాయని బాధితులు వాపోతనాఆ్నరు. గత ఏడాది బదిలీ తర్వాత కొత్త స్కూల్‌లో చేరిన వారిని ఏడెనిమిదేళ్ల క్రితం ఆ స్కూల్‌లో చేరినట్లు చూపుతోంది. జాయినింగ్‌ తేదీలు తప్పుగా చూపుతోంది. ఈ కారణంగా ఉపాధ్యాయులకు కేటాయించే పాయింట్లలో భారీ తేడాలు వచ్చాయి. బాధితులు, వారి బంధువులు వీటిని సరిచేయించే పనిలో నిమగ్నమయ్యారు. స్కూళ్లలో చేరిన తేదీలు, సర్వీస్‌ బుక్స్‌, ఇతర డాక్యుమెంట్లపై ఎంఈఓలతో సంతకాలు చేయించుకుని డీఈఓకు ఆఫీ్‌సకు క్యూ కడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం డీఈఓ ఆఫీస్‌ తపాల్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల నుంచి అర్జీలు స్వీకరించారు.

సంఘాల నేతలతో సమావేశం

డీఈఓ వెంకట క్రిష్ణారెడ్డి పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని సైన్స్‌ సెంటర్‌లో బదిలీల్లో ఎదురవుతున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేసే విషయాన్ని చర్చించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising