ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్గీకరణతోనే ఎస్సీలకు సమ ఫలాలు

ABN, First Publish Date - 2022-12-20T00:36:45+05:30

ఎస్సీ వర్గీకరణతో ఆయా కులాల ప్రజలకు సమాన ఫలాలు అందుతాయని ఎంఎ్‌సపీ, ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సామ్రాట్‌ కేబీ మధు అన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.

తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న ఎంఎస్‌పీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మధు

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 19: ఎస్సీ వర్గీకరణతో ఆయా కులాల ప్రజలకు సమాన ఫలాలు అందుతాయని ఎంఎ్‌సపీ, ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సామ్రాట్‌ కేబీ మధు అన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక తదితర అనేక అంశాల్లో మాదిగలు వెనుకబడ్డారని అన్నారు. ఎస్సీల్లోని 59 కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్గీకరిస్తేనే అందరికీ అవకాశాలు దక్కుతాయని అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం ఆర్డీవో కార్యాలయం వద్ద, 21న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామని, 23న కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ తిరుపాల్‌, కదిరప్ప, నిస్సార్‌ అహ్మద్‌, రామకృష్ణ, జయరామ్‌, త్యాగరాజు, నరసింహులు, శ్రీరాములు, మలోబులేసు, సుబ్బరాయుడు, సునీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-20T00:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising