ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు భవనాల పరిశీలన

ABN, First Publish Date - 2022-09-29T05:31:01+05:30

మండలంలోని గుమ్మయ్యగారిపల్లివద్ద ఉన్న క్రెడ్స్‌ పాఠశాలలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అధికారులు బుధవారం ఆ భవనాలను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, సెప్టెంబరు 28: మండలంలోని గుమ్మయ్యగారిపల్లివద్ద ఉన్న క్రెడ్స్‌ పాఠశాలలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అధికారులు బుధవారం ఆ భవనాలను పరిశీలించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయం సంఘటన రీజనల్‌ ఆఫీస్‌ నుంచి అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌రావు, అనంతపురం కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ కరీం ఖాన, సీపీడబ్ల్యుడీ ఇంజనీర్‌ ముకుందరెడ్డి, పరిశీలన కోసం గోరంట్లకు వచ్చారు. కలెక్టర్‌ బసంతకుమార్‌, పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, డీఈఓ మీనాక్షి, క్రెడ్‌ ్స పాఠశాల భవనాలను పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరంలోనే 1 నుంచి 8వ తరగతి వరకు డేస్‌స్కాలర్స్‌కోసం విద్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతోందని, పాఠశాలలోని ఏడెకరాల స్థలంలో మైదానం ఏర్పాటు చేయవచ్చన్న అంచనాకు అధికారులు వచ్చారు. అయితే కొత్తగా ఏర్పాటవుతున్న ముదిగుబ్బ-కోడూరు హైవేకోసం క్రెడ్స్‌ పాఠశాలలోని ఆఫీ్‌సరూమ్‌ తొలగించే అవకాశం ఉన్నట్లు కమిషనర్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. హైవే పనులు చేపట్టేలోగా కొత్త భవనం పూర్తవుతుందని వారు అభిప్రాయపడ్డారు. తాగునీరు తదితర మౌలిఆళఙక సదుపాయాలు కల్పిస్తే వీలైనంత త్వరగా భవన నిర్మాణాలు జరిగే అవకాశం ఉందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రంగనాయకులు, ఎంఈఓ గోపాల్‌నాయక్‌, నాసెన ఇనచార్జ్‌ శ్రీకాంతరెడ్డి, ఆర్‌ఐ శ్రీకాంత, వీఆర్‌ఓలు, అనీల్‌, మన్సూర్‌, వినోద్‌, క్రెడ్స్‌ పాఠశాల యజమాని వెంకటేశ ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising