ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా నిఽధులు మాకివ్వండి

ABN, First Publish Date - 2022-10-18T05:07:52+05:30

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పంచాయతీలకే ఇవ్వాలని జిల్లా సర్పంచల సంఘం నాయకులు.. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామ పంచాయతీ సర్పంచల డిమాండ్‌

కలెక్టరేట్‌ వద్ద నిరసన

పుట్టపర్తి, అక్టోబరు 17: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పంచాయతీలకే ఇవ్వాలని జిల్లా సర్పంచల సంఘం నాయకులు.. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచలు రజనీ్‌షరెడ్డి, జగన్మోహనచౌదరి, రాఘవేంద్ర, చలపతినాయుడు, నారాయణనాయక్‌, తిరుమలే్‌షగౌడ్‌ తదితరులు సోమవారం ర్యాలీగా పుట్టపర్తిలోని కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రప్రభుత్వం అక్రమంగా వాడుకుందనీ, వెంటనే పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో పంచాయతీల్లో పరిపాలన అధ్వానంగా మారిందని మండిపడ్డారు. విద్యుత బకాయిలను పాత పద్ధతిలో ప్రభుత్వమే చెల్లించాలని డిమాండు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా కాకుండా, కొత్తగా తెరిచిన పీఎ్‌ఫఎంఎస్‌ ఖాతాకు జమచేయాలని డిమాండ్‌  చేశారు. గ్రామ సచివాలయాలను గ్రామ పంచాయతీల్లో విలీనం చేయాలనీ, సర్పంచల గౌరవ వేతనాన్ని పెంచాలని, ఎనఆర్‌ఈజీఎ్‌స పనులను సర్పంచుల ద్వారా చేపట్టేలా అధికారాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన రూ.8,700 కోట్లను ఖాతాలకు వెంటనే జమ చేయాలని డిమాండు చేశారు. అనంతరం కలెక్టరుకు వినతి పత్రం అందచేశారు. కలెక్టర్‌ వాహనిన్ని అడ్డుకున్నారు.



Updated Date - 2022-10-18T05:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising