ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి అత్యంత ప్రమాదకరం ఆర్‌ఎ్‌సఎస్‌

ABN, First Publish Date - 2022-10-03T05:55:33+05:30

ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాలు, అనుసరించే పద్ధతులు ద్వేషాన్ని నింపేవిధంగా వున్నాయని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఎ్‌సఎస్‌ లోతుపాతులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 2 : ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాలు, అనుసరించే పద్ధతులు ద్వేషాన్ని నింపేవిధంగా వున్నాయని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. కన్నడ రచయిత దేవనూరు మహదేవ రచించిన ’ఆర్‌ఎ్‌సఎస్‌ లోతుపాతులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌, మానవహక్కుల వేదిక నాయకుడు ఎస్‌ఎం బాషా, జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన, రసూల్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబులు, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ హాజరై తొలుత గాంధీ జయంతి సందర్భంగా మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన మతోన్మాద శక్తి గురించి పుస్తకంలో రచయిత దేవనూరు మహదేవ చక్కగా వివరించారన్నారు. మనుధర్మశాస్త్రం ఆధారంగా వర్ణాశ్రమ విధానాన్ని అమలు చేసి, కులవ్యవస్థను కాపాడుకునే విధానాన్ని తెలిపారన్నారు. అదేవిధంగా సేవా, సాంస్కృతిక ముసుగులో ప్రజల్లోకి చొరబడి లక్షలాది మంది యువతను పక్కదారి పట్టిస్తున్న తీరు, వారినుంచి యువతను రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. అధికారాన్ని బీజేపీ రూపంలో ఆర్‌ఎ్‌సఎస్‌ అమలు చేస్తోందన్నారు.  కార్పొరేట్‌ కంపెనీలకు రూ.లక్షల కోట్ల జాతీయ సంపదను, సహజ వనరులను దోచిపెడుతూ, మరోవైపు ప్రజలమీద అనేక రూపాల్లో ముఖ్యంగా జీఎస్టీ పేరుతో భారాలు వేస్తోందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రజా అనుకూల విధానాలను అమలు చేయడంలో, ఉపాధి కల్పించడంలో, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మత విద్వేశాలతో అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో విద్వాన విశ్వం విజ్ఞానకేంద్రం నాయకుడు శ్రీనివాసరావు, విశ్రాంత డిప్యూటి కలెక్టర్‌ గోవిందరాజులు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జిలాన, గాంగేనాయక్‌, వెంకటస్వామి, వీకే రంగారెడ్డి, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, కౌలురైతుసంఘం నాయకులు బాలరంగయ్య, ఆర్‌వి నాయుడు, రామిరెడ్డి, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు సూర్యచంద్ర, పరమేష్‌, ఆవాజ్‌ వలి, ముష్కిన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising