ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-06-30T05:31:57+05:30

నష్టపోయిన వేరుశనగ రైతులకు ఎకరాకు రూ. 25 వేల పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌

  గుంతకల్లు/గుత్తి, జూన్‌ 29: నష్టపోయిన వేరుశనగ రైతులకు ఎకరాకు రూ. 25 వేల పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జూలై 4న కలెక్టరేటు వద్ద చేపట్టనున్న ధర్నాకు సంబంధించి చేపడుతున్న జీపు జాతా బుధవారం గుత్తి, గుంతకల్లు పట్టణాలకు చేరింది.  ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనిదినాలను పెంచి నిధులు పెంచాలని, వ్యవ సాయ విద్యుత్‌ మోటర్లకు మీటర్లను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత 200 యూనిట్ల విద్యుత్తును కొనసాగిం చాలని మున్సిపాలిటీల్లో పెంచిన చెత్త,  ఆస్తి పన్ను లను తగ్గించాలని డిమాండుచేస్తూ కలెక్టరేట్‌ వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం గుంతకల్లు పట్టణ కార్యదర్శి బీ శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, నాయకులు కసాపురం రమేశ్‌, తిమ్మప్ప, వైటీ చెరువు రమేశ్‌, గుత్తి కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, స్థానిక మండల, పట్టణ కార్యదర్శులు రామకృష్ణ, నిర్మల, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising