ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మభ్యపెట్టాలని చూస్తే మసైపోతావ్‌ !

ABN, First Publish Date - 2022-01-24T05:13:28+05:30

నిరుద్యోగ యువతను మభ్యపెట్టాలని చూసినా, నిర్లక్ష్యం చేసినా వారి ఆగ్రహజ్వాలల్లో మాడి మసైపోతావని విద్యార్థి, యువజన సంఘాల నేతలు సీఎం జగనను హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగ విరమణ వయస్సు పెంపును విరమించు కోవాలి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నేతలు

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 23: నిరుద్యోగ యువతను మభ్యపెట్టాలని చూసినా, నిర్లక్ష్యం చేసినా వారి ఆగ్రహజ్వాలల్లో మాడి మసైపోతావని విద్యార్థి, యువజన సంఘాల నేతలు సీఎం జగనను హెచ్చరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే జాబ్‌క్యాలెండర్‌, నోటిఫికేషన విడుదల చే యాలని, ఉద్యో గ విరమణ వయస్సు పెంపును ఉపసంహరిం చుకోవాల ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డిభవనలో విద్యార్థి, యువజనసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఏఐవై ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనినబాబు, ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సనబాబు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు మనోహర్‌, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్య దర్శులు రాజేంద్రప్రసాద్‌, సంతో్‌షకుమార్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరుశురామ్‌, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి వీరేంద్రలు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభు త్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేస్తామ ని హామీ ఇచ్చినప్పటికీ మూడేళ్లలో ఒక్క జాబ్‌క్యాలెండర్‌ కూడా విడుదల చేయకపోవడం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమేనన్నారు. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమంతో సీఎం జగన, ప్రభుత్వ మెడలు వంచైనా తమ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. ఈనెల 25వతేదీ నుంచి 31వతేదీ వరకు జిల్లా ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వడం, విద్యార్థి, యువజ న, నిరుద్యోగ, ప్రజాసంఘాలతో మండల కేంద్రాల్లో సద స్సులు ఏర్పాటు చేసి చైతన్యం చేసి, ఫిబ్రవరి 10న కలె క్టరేట్‌ ముట్టడి చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌, నాయకులు మోహన, రాము, కుళ్లాయప్ప, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు ఉమామహేష్‌, కృష్ణ  పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-24T05:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising