ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌లోనూ బోల్తా

ABN, First Publish Date - 2022-06-25T05:39:51+05:30

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా బోల్తా కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టె న్త్‌లో 6.60 శాతం పాస్‌

 1,772 మందిలో 117 మాత్రమే ఉత్తీర్ణత

 ఇంటర్‌లో 25.16 శాతం, 969 మాత్రమే పాస్‌  


 అనంతపురం విద్య, జూన్‌ 24:  ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా బోల్తా కొట్టింది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో మునుపెన్నడూ లేని విధం గా ఫలితాలు వచ్చాయి. ‘ఓపెన్‌’ టెన్త్‌లో 1772  మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా 117 మాత్రమే పాస్‌ కాగా, 6.60 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇంటర్‌లో 3852 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా 969మంది మాత్రమే పాస్‌ కాగా  25.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు  రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లో జవాబు పత్రం జిరాక్స్‌ పొందేందుకు దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 27 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకూ అవకాశం ఉంది. ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం  2.30 గంటల నుంచి సాయంత్రం 5 .30 గంటల వరకూ జరుగుతాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఆగస్టు 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈనెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకూ గడువు ఇచ్చారు.

చివర్లో అనంత...

ఓపెన్‌ స్కూల్‌  ఇంటర్‌, పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఆఖరిలో నిలిచింది. ఫలితాల్లో రాష్ట్ర సగటు  పదో తరగతిలో   52.64   శాతం ఉంటే, అనంతపురం 6.60 శాతం, ఇంటర్‌లో రాష్ట్ర సగటు 60.40 శాతం ఉంటే జిల్లా సగటు25.16 శాతం నమోదైంది. అటు టెన్త్‌లో కా నీ, ఇటు ఇంటర్‌లో కానీ రాష్ట్ర సగటు ఫలితాలకు దరిదాపుల్లో కూడా జిల్లా ఫలితాలు రాలేదు. 


Updated Date - 2022-06-25T05:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising