ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారి పునర్నిర్మాణం ఎప్పుడో?

ABN, First Publish Date - 2022-08-22T05:25:38+05:30

భారీవర్షాల కారణంగా కూలిన రహదారి పనులుఎప్పుడు చేపడతారో అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

దెబ్బతిన్న సీసీ రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాండ్లపెంట, ఆగస్టు 21: భారీవర్షాల కారణంగా కూలిన రహదారి పనులుఎప్పుడు చేపడతారో  అని  గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని సోమయాజులపల్లి నుంచి వేపలకుంట మీదుగా వెళ్లే రహదారికి గతంలో ఎమ్మెల్యే నిధులతో సిమెంటు రోడ్డు వేశారు. ఇది సోమాయాజులపల్లి నుంచి వేపల కుంట మీదుగా... మల్లమీదపల్లి రోడ్డుకు వెళ్లడానికి లింక్‌రోడ్డు. గత యేడాది కురిసిన భారీ వర్షాలకు గండిచెరువు నిండి నీరు అధికంగా రావడంతో... ఏకం గా ఈ సిమెంటు రోడ్డు కోతకు గురై పూర్తిగా పాడై పోయింది. గత యేడాది దెబ్బతిన్న పంటలను, సోమ యాజులపల్లి రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి  పరిశీలించారు. ఆయన పరిశీలించి యేడాది కాలం అవుతున్నా ఈ రోడ్డు పునర్నిర్మాణానికి ఎలాంటి ప్రయత్నాలు చేపట్టలేదు. ప్రధానంగా సోమయాజు పల్లిలో సచివాలయానికి వెళ్లాలంటే పంచాయతీలోని తూపల్లి, కటకంవారిపల్లి, వంకపల్లి, వేపలకుంట గ్రా మస్థులు ఈ రహదారి గుండానే రాకపోకలు సాగిం చాల్సి ఉంది. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు వారు ఇబ్బం దులు పడుతున్నారు. ఇప్పటి కైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పం దించి రహదారి మరమ్మతులు చేపట్టి, గ్రామస్థులకు సౌకర్యం క్పలించా లని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై పీఆర్‌ఐయూ జేఈని సంప్రదించాలనుకుంటే ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. 


Updated Date - 2022-08-22T05:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising