ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంచు భూమీ వదలకుండా రీ సర్వే

ABN, First Publish Date - 2022-12-07T00:08:47+05:30

జిల్లా వ్యాప్తంగా భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌లు అధికారులను ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం టౌన, డిసెంబరు6: జిల్లా వ్యాప్తంగా భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో మంగళవారం భూ రీసర్వేపై అధికారులతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 41 గ్రామాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా రీసర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో రీసర్వే చేపట్టాలన్నారు. మొత్తం ఆరు విడతలలో ఈ రీసర్వే జరగుతుందన్నారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన ద్వారా నిబందనలను వివరించారు. రీసర్వే వేగవంతం చేయడానికి ఇప్పటికే మండలానికి ప్రత్యేకంగా డిప్యూటీ తహసీల్దార్‌లను నియమించామన్నారు. గ్రామ స్థాయిలో సర్వేయింగ్‌ టీమ్‌లు సర్వే నంబర్‌ ప్రకారం సర్వే చేపట్టాలన్నారు. ఇంచు భూమి కూడా వదలకుండా సర్వే చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లు, 31 మండలాలు, 577 గ్రామ పంచాయితీలు, 6 మున్సిపాలిటీల్లో కలిపి 10,204.35 చదరపు కిలోమీటర్ల భూమి ఉందన్నారు. ఈ భూమిలో రీసర్వే వెంటనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రీసర్వే పూర్తి చేసి హక్కుపత్రాలు అందించాలన్నారు. ఈ సర్వేలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ప్రభాకరరావుతో పాటు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising