ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్ళ కాలంలో ప్రభుత్వం రైతులకు చేసింది ఏమిటో ప్రకటించాలి: Ramakrishna

ABN, First Publish Date - 2022-06-13T16:15:58+05:30

సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా సీపీఐ నేత రామకృష్ణ బహిరంగ లేఖ విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Anantapuram: ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) జిల్లా పర్యటన సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) బహిరంగ లేఖ (Letter) విడుదల చేశారు. మూడేళ్ళ కాలంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) రైతులకు చేసింది ఏమిటో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘‘ఇన్ పుట్ సబ్సిడీ మూడేళ్ళుగా ఇవ్వడం లేదు... రైతులకు డ్రిప్ ఇవ్వడం లేదు.. రాష్ట్ర వ్యాప్తంగా పంట దిగుబడులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు.. రాయలసీమలో కంది దిగుబడులు కొనుగోలు చేయడం లేదు... ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు.. హంద్రీనీవా కాలువ సామర్థ్యం పెంచుతాం అన్నారు.. అతీగతి లేదు... సమాంతర కాలువ అన్నారు... కనీసం ఆధునికీరణ పనులు కూడా జరగడం లేదు.. జిల్లాలో ఒక్క పిల్ల కాల్వ కూడా తవ్వలేదని’’ లేఖలో ఆరోపించారు.


సీఎం జగన్ రైతాంగాన్ని పక్కన పెట్టేశారని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా మాట్లాడని దద్దమ్మని రామకృష్ణ విమర్శించారు. పోలవరంను గాలికి వదిలేశారని, రైతులకు ఏమి చేసింది.. చెన్నేకొత్తపల్లి సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలను గృహనిర్భంధం చేస్తారని, కలెక్టరెట్ దగ్గర ఆందోళన చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మూడు పంటలు పండించే వారు క్రాప్ హాలీడే ప్రకటించినందుకు ప్రధాని మోదీ, సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు. క్రాప్ హాలిడే ప్రకటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-13T16:15:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising