ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో పుష్పయాగం

ABN, First Publish Date - 2022-08-17T05:12:09+05:30

స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సమీపం, శ్రీనివాసనగర్‌లో సప్తఫణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శ్రావణమాసాన్ని పుర ష్కరించుకుని తిరుమంజనసేవ, పుష్ప యాగాన్ని మంగళవారం ఘనంగా నిర్వ హించారు.

యాగానికి తీసుకొచ్చిన పలురకాల పూలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం అర్బన, ఆగస్టు 16 : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సమీపం, శ్రీనివాసనగర్‌లో సప్తఫణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శ్రావణమాసాన్ని పుర ష్కరించుకుని తిరుమంజనసేవ, పుష్ప యాగాన్ని మంగళవారం ఘనంగా నిర్వ హించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి వివిధ అభిషేకాలు, అర్చనలు చేశారు. పుష్పయాగం కోసం బెంగళూరు నుంచి వివిధ రకాల ప్రత్యేక పూలను తీసుకొ చ్చారు. వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం నుంచి పుష్పాలను మంగళవాయిద్యాలు, మేళతాళాలతో ఊరే గింపుగా సుబ్రమణ్య స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుమల పాదయాత్ర బృందం మహావిష్ణు సహస్త్రనామా పారాయణం, భజన, వేద పారాయణం నిర్వహించారు. 8 గంటలకు అష్టావధానసేవ, మహా మంగళహారతి నిర్వహించి మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు. వివిధ పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశరెడ్డి, బజరంగ్‌దళ్‌ నాయకులు నవీన తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T05:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising