ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్ధిజం.. సాయిజం.. ఒక్కటే

ABN, First Publish Date - 2022-05-17T05:43:32+05:30

బుద్ధిజం.. సాయిజం ఒక్కటేనని బుద్ధిజం చీఫ్‌ మాంక్‌ లొపానపుర్పా సర్పా పేర్కొన్నారు. స్థానిక ప్రశాంతి నిలయంలో సోమవారం బుద్ధపూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు

పుట్టపర్తి, మే 16: బుద్ధిజం.. సాయిజం ఒక్కటేనని బుద్ధిజం చీఫ్‌ మాంక్‌ లొపానపుర్పా సర్పా పేర్కొన్నారు. స్థానిక ప్రశాంతి నిలయంలో సోమవారం బుద్ధపూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. బుద్ధిజం చీఫ్‌ మాంక్‌ లొపానపుర్పా సర్పా జ్యోతి ప్రజ్వలన చేసి, వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఆయన  ప్రసంగిస్తూ గౌతమ బుద్ధుడు, సత్యసాయి బోధనలు రెండూ సారూప్యం కలిగి ఉన్నాయన్నారు. బుద్ధుడు అహింసను బోధించగా.. సత్యసాయి పంచసూత్రాలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసను బోధించారన్నారు. మానవతావిలువ లు పాటిస్తే సుఖశాంతులు సమృద్ధిగా ఉంటాయన్నారు. ప్రపంచంలోని ప్రశాంతజీవనానికి చక్కనైన ప్రదేశం ప్రశాంతినిలయం అన్నారు. అనంతరం బౌద్ధ సన్యాసులు సంగీత కచేరి నిర్వహించారు. శ్రీలంక భక్తులు విటుట హటాట పేరిట చేసిన నృత్యం, డోలు వాయిద్యం భక్తులను అలరింపజేసింది. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌.. విదేశీ భక్తులకు శ్వేతవసా్త్రలు, బహుమతులు అందజేశారు. వేడుకల్లో సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన చక్రవర్తి, జాతీయ అధ్యక్షుడు నిమీ్‌షపాండే, నేపాల్‌, శ్రీలంకతోపాటు వివిధ రాషా్ట్రల భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising