ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉజ్వల కాటేజీల్లో సర్వే

ABN, First Publish Date - 2022-05-16T06:57:38+05:30

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పట్టణంలోని ఉజ్వల ఫౌండేషన కాటేజీల్లో ఆక్రమణలపై విచారణకు నియమించిన త్రిసభ్య కమిటీ ఆదివారం రెవెన్యూ అధికారులతో కలసి సర్వే నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పుట్టపర్తి, మే  15: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పట్టణంలోని ఉజ్వల ఫౌండేషన కాటేజీల్లో ఆక్రమణలపై విచారణకు నియమించిన త్రిసభ్య కమిటీ ఆదివారం రెవెన్యూ అధికారులతో కలసి  సర్వే నిర్వహించింది. ఆర్డీఓ భాగ్యరేఖ, తహసీల్దార్‌ భాస్కర్‌నారాయణ, పుడా వైస్‌చైర్మన నరే్‌షకృష్ణ, కమిషనర్‌ మునికుమార్‌, ఆర్‌ఐ శ్రీనివాసులు, సర్వేయర్లు, వీఆర్వోలు.. రికార్డుల ప్రకారం భూమిని పరిశీలించి సర్వే చేపట్టారు. ఎనుములపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని 356, 365-2 సర్వే నెంబర్లలో మొత్తం 6.35 ఎకరాలకు ఉజ్వల ఫౌండేషన  అప్పట్లో పుడా అనుమతులు తీసుకుంది. పుడా ప్లాన ప్రకారం సర్వేలు నిర్వహించారు. కాటేజీలకు పడమర వైపున 20 అడుగులు, దక్షిణం వైపున 50 అడుగుల వెడల్పుతో స్థలాన్ని సర్వే గ్రీన ఫీల్డ్‌ కోసం వదిలారని ఆ స్థలానికి మార్కింగ్‌ వేశారు. ప్రధాన గేట్‌ను తొలగించి మరో పక్కన ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి, నివేదికను కలెక్టర్‌కు అందచేస్తామని ఆర్డీఓ తెలిపారు.


సమగ్ర విచారణ చేయించాలి

ముఖ్యమంత్రికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

పుట్టపర్తి, మే 15: ఉజ్వల ఫౌండేషన కాటేజీల్లో అక్రమాలపై సమగ్ర విచారణ చేయించి, బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 40 ఏళ్ల క్రితం పుడా నిబంధనల మేరకు ఉజ్వల ఫౌండేషన కాటేజీలను నిర్మించిందన్నారు. వాటిని సత్యసాయి భక్తులు కొనుగోలు చేశారన్నారు. ఇటీవలిగా అధికార, ప్రతిపక్ష నాయకులు ఉజ్వల భూములను కబ్జా చేశారన్నారు. ఉజ్వల కాటేజీల్లో పుడా నిబంధనలకు అనుగుణంగా వదిలిన పార్కు, రోడ్లకోసం వదిలిన దాదాపు 2 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. రాజకీయ పార్టీల ఆందోళనలకు స్పందించిన కలెక్టర్‌ బసంతకుమార్‌.. ఆర్డీఓ, పుడా వై్‌సచైర్మన, మున్సిపల్‌ కమిషనర్‌తో త్రిసభ్య కమిటీ వేశారన్నారు. కమిటీలోని పుడా వై్‌సచైర్మన, మున్సిపల్‌ కమిషనర్‌.. కబ్జాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన ప్రకటనలో వివరించారు.


Updated Date - 2022-05-16T06:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising