ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదీ జలాల పునఃపంపిణీతోనే ప్రగతి

ABN, First Publish Date - 2022-09-27T04:51:23+05:30

నదీ జలాల పునఃపంపిణీతోనే ఉమ్మడి అనంత జిల్లా తాగు, సాగునీటి ఎద్దడి నుంచి బయటపడుతుందని వక్తలు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటి అవసరాలు-మనమేం చేద్దాం సదస్సులో వక్తలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు26: నదీ జలాల పునఃపంపిణీతోనే ఉమ్మడి అనంత జిల్లా తాగు, సాగునీటి ఎద్దడి నుంచి బయటపడుతుందని వక్తలు పేర్కొన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ కో-ఆర్డినేషన కమిటీ ఆధ్వర్యంలో ‘ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి అవసరాలు - మనమేం చేద్దాం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ కమిటీ జిల్లా అధ్యక్షుడు శివానంద అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సాగునీటి పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజ నేయులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, వేమనా సాంస్కృతిక అధ్యయన కేంద్రం అధ్యక్షుడు అప్పిరెడ్డి హరినాథ్‌రెడ్డి, రాయలసీమ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడు హరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఆల్మట్ట్టి, బుక్కపట్నం లింకు కెనాల్‌ ప్రతిపాదనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. హెచఎనఎ్‌సఎ్‌సకు 60 టీఎంసీల నికర జలాలను కేటాయించి, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశా రు. బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి అనంత జిల్లాలో 25 లక్షల ఎకరాలు సాగుభూమి ఉంటే అందులో సగభాగం  వర్షాధారంగా సాగుతోందన్నారు. దీంతో ప్రజలందరూ ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పిరెడ్డి హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు బాగుంటేనే కళాకారులు బాగుంటారన్నారు. కానీ ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఏపీ రైతుకూలీ సంఘం అధ్యక్షుడు నరసింహయ్య, ఆర్‌కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే మల్లికార్జున, ఆర్‌సీసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పామురాయి రాఘవ, జిల్లా ఉపాధ్యక్షుడు బి. బాలరాజు, ఎస్‌వీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజు, విద్యావంతుల వేదిక నాయకులు వెంకటేష్‌, పలు ప్రజా సంఘాల నాయకులు సోమర రాహుల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-09-27T04:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising