ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి బోరు స్టార్టర్‌ పెట్టెకు విద్యుత సరఫరా

ABN, First Publish Date - 2022-09-26T05:17:44+05:30

నగర పంచాయతీ ప రిఽఽధిలోని పలు తాగునీటి పథకాల విద్యుత పరికరాలు ప్రమాదకరం గా మారాయి. నగర పంచాయతీ అయితే తమ గ్రామం అన్ని విధా లా అభివృద్ధి చెందుతుందని ఆశించిన ప్రజలకు షాక్‌ ఇస్తున్నారు.

ప్రమాదకరంగా స్టార్టర్‌ పెట్టె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ రూరల్‌, సెప్టెంబరు 25: నగర పంచాయతీ ప రిఽఽధిలోని పలు తాగునీటి పథకాల విద్యుత పరికరాలు ప్రమాదకరం గా మారాయి. నగర పంచాయతీ అయితే తమ గ్రామం అన్ని విధా లా అభివృద్ధి చెందుతుందని ఆశించిన ప్రజలకు షాక్‌ ఇస్తున్నారు. కోనాపురం 19వ వార్డులో టీడీపీ హయాంలో ప్రజల దాహార్తిని తీ ర్చేందుకు తాగునీటి బోరును ఏర్పాటు చేశారు. బోరుమోటారుకు అ మర్చిన స్టార్టర్‌ పెట్టెకు విద్యుత సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్థులు మోటార్‌ ఆన చేసి నీటిని పట్టుకొనేందుకు భయపడుతున్నారు. తాగునీటి కోసం వచ్చి స్టార్టర్‌ను కట్టెతో ఆన చేసి నీటిని ప ట్టుకుంటున్నారు.  ‘కరెంటు షాకు కొడుతోంది.. జాగ్రత్తగా ఆన చే యాలి’ అంటూ అధికారులు స్టార్టర్‌ పెట్టెకు స్టిక్కర్‌ అతికించి చేతులు దులుపుకున్నారు. విద్యుత ప్రమాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ ని లదీస్తున్నారు. కౌన్సిలర్‌, మున్సిపల్‌ అధికారులకు విషయం తెలిసినా  పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు స్పందించి స్టార్టర్‌ పెట్టెకు మరమ్మతులు చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2022-09-26T05:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising