ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందకొడిగా ఈ-క్రాప్‌ బుకింగ్‌

ABN, First Publish Date - 2022-08-19T04:45:31+05:30

రైతు సాగుచేస్తున్న పంటలను ఈ-క్రాప్‌ బుకింగ్‌ ద్వారా నమోదు చేస్తున్న ప్రక్రియ మండలంలో మందకొడిగా సాగుతోంది.

మరవకొత్తపల్లిలో ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు రోజుల్లో 51.2 ఎకరాలకే పరిమితం


చిలమత్తూరు, ఆగస్టు 18: రైతు సాగుచేస్తున్న పంటలను ఈ-క్రాప్‌ బుకింగ్‌ ద్వారా నమోదు చేస్తున్న ప్రక్రియ మండలంలో మందకొడిగా సాగుతోంది. కార్యక్రమం రెండో రోజు జరుగుతున్నా మండల వ్యాప్తంగా కేవలం 52.2 ఎకరాల పంటను మాత్రమే న మోదు చేశారు. దీన్నిబట్టి ఏస్థాయిలో ఈ-క్రాప్‌ బుకింగ్‌ జరుగుతోందో అర్థమవుతోంది. గత ఏడాది ఈ-క్రాప్‌ బుకింగ్‌లో జరిగిన పొరపాట్లతో అర్హులైన రైతులకు ప్రభుత్వం నుంచి అందే బీమా, ఇ నపుట్‌ సబ్పిడీ అందకుండా పోయింది. ఈ ఏడాదైనా సాగుచేసిన పంటను నమోదు చేసుకుందామనుకుంటున్న రైతులకు ఇబ్బందు లు తప్పడం లేదు. 


అధికారుల కోసం వేచిచూసి...

ఈ-క్రాప్‌ బుకింగ్‌కి ప్రభుత్వం వచ్చే నెల 7వ తేదీ వరకు సమ యం ఇచ్చింది. ఈలోగా మండలంలో సాగువుతున్న అన్ని రకాలు పంటల నమోదు జరగాల్సి ఉంది. ఈప్రక్రియలో గ్రామ సచివాల అ గ్రికల్చర్‌ అసిస్టెంట్‌తో పాటు సర్వేయర్‌, వీఆర్వోలు విధిగా ఉంటున్నారు. రైతు ఫొటోని సాగుచేసిన పొలంలో కాప్చర్‌ చేసి, సర్వేనంబర్‌ను జియో ట్యాగ్‌ చేస్తున్నారు. అయితే సర్వర్‌ సమస్య అంటూ కొన్ని చోట్ల అధికారులు ఒకటి, రెండు ప్రయోగాలు చేసి ఎండలు ఎ క్కువవగానే పొలాలను విడిచి ఆర్‌బీకేలకు చేరుకుంటున్నట్లు సమాచారం. ఈ-క్రాప్‌ బుకింగ్‌ సమయంలో ఎవరూ ఆర్‌బీకేలలో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా కొందరు ఆర్‌బీకేలకు వచ్చేయడం, మరికొందరు ఫీల్డ్‌లో ఉన్నామని చెప్పి బయట తిరగ డం చేస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు పంట నమోదు కోసం  పొలాల వద్దే అధికారుల కోసం వేచి ఉండి, విధిలేక తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. 


పర్యవేక్షణలోపంతోనే..

 ఆరుగాలం కష్టపడిన రైతుకి పంట నష్టం జరిగినప్పుడు ప్రభు త్వం నుంచి సాయం అందాలంటే ఈ-క్రాప్‌ బుకింగ్‌ ఎంతో ప్రధానమైంది. ఈ పరిస్థితుల్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానం రైతుపై తీవ్రంగా పడుతుంది. దీంతో క్షేత్రస్థాయిలో విధుల కు డుమ్మా కొట్టడం, సర్వర్‌ సమస్య అంటూ పంట నమోదు చేయకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వ స్తోంది. పంట నమోదులో విస్తీర్ణం తగ్గినా, పంట పేరు మారినా స మస్యలు తప్పవు. అయితే ఈ-క్రాప్‌ బుకింగ్‌పై ఉన్నతాధికారుల ప ర్యవేక్షణ లేకపోతే గత ఏడాది జరిగిన నష్టాలే ఈఏడాది కూడా రైతులకు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-08-19T04:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising