ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపం

ABN, First Publish Date - 2022-05-30T06:09:07+05:30

రొద్దం మండలం బూచర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు ముత్యాలమ్మ దుస్థితి ఇది. ఈమె భర్త మారెప్ప చాలా ఏళ్ల క్రితం మరణించాడు. ఉన్న ఇద్దరు కుమారులు బెంగళూరుకు కూలి పనులకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

90 ఏళ్ల వృద్ధురాలి పింఛన తీసేశారు..

ముడతలు పడిన దేహం..

ఎముకలకు అతుక్కుపోయిన చర్మం..

చేతిలో కర్ర.. మాసిన దుస్తులు..

ఈ వృద్ధురాలిని చూస్తే.. ఎవ్వరికైనా..

అయ్యో.. పాపం.. అనిపిస్తుంది..

వయసు 90 ఏళ్లు.. భర్త ఏళ్ల క్రితమే 

చనిపోయాడు.. 

ఇద్దరు కుమారులు.. పొట్ట  చేతపట్టుకుని 

వలస వెళ్లారు.. ఇంటి వద్ద 

ఒంటరిగా ఉంటోంది.. ఎన్టీఆర్‌ హయాం 

నుంచి పింఛన తీసుకుంటోంది.. 

అదే ఆధారం.. అలాంటి పింఛనను 

వైసీపీ పాలనలో నిర్ధాక్షిణ్యంగా 

తొలగించారు.. సెంటు భూమి 

లేకున్నా.. 11 ఎకరాలు 

ఉందంటూ నమోదు చేశారు..

9 నెలలుగా పింఛన రాక..

కళ్లు కూడా కనిపించని పండుటాకు..

అష్టకష్టాలు పడుతోంది..

ఎవరైనా దయతలచి పెడితే.. తినడం..

లేదంటే.. పస్తుండడం..


రొద్దం మండలం బూచర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు ముత్యాలమ్మ దుస్థితి ఇది. ఈమె భర్త మారెప్ప చాలా ఏళ్ల క్రితం మరణించాడు. ఉన్న ఇద్దరు కుమారులు  బెంగళూరుకు కూలి పనులకెళ్లారు. ఈమె ఎన్టీ రామారావు కాలం నుంచి పింఛన తీసుకుంటోంది. 2021 అక్టోబరు వరకు పింఛన వచ్చింది. ఆనలైనలో కుటుంబ వివరాల నమోదులో ఆమె పేరు లేదంటూ అధికారులు పింఛన తొలగించారు. సెంటు భూమిలేకున్నా.. 11 ఎకరాల భూమి ఉన్నట్లు ఆనలైనలో చూపడంతో పెన్షన పోయింది. అప్పటి నుంచి పింఛన రాక అవస్థలు పడుతోంది. ఈ విషయమై బూచర్ల పంచాయతీ కార్యదర్శి అరుణను వివరణ కోరగా.. పింఛన పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

రొద్దం

Updated Date - 2022-05-30T06:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising