ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర సరిహద్దులో పెట్రోలు బంకుల మూత

ABN, First Publish Date - 2022-09-24T05:09:06+05:30

డీజిల్‌, పెట్రోలు ధరల్లో మన రాష్ట్రానికి, పక్కనున్న కర్ణాటకు భారీ వ్యత్యాసం ఉండటంతో వినియోగదారులు అటువైపు క్యూ కడుతు న్నారు.

మూత పడిన పెట్రోల్‌ బంక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఉపాధి కోల్పోయి వీధిన పడిన 50 కుటుంబాలు

విడపనకల్లు:  డీజిల్‌, పెట్రోలు ధరల్లో మన రాష్ట్రానికి, పక్కనున్న కర్ణాటకు భారీ వ్యత్యాసం ఉండటంతో వినియోగదారులు అటువైపు క్యూ కడుతు న్నారు. ఆంధ్ర సరిహద్దు నుంచి కర్ణాటకలోని జోల్దరాసి గ్రామంలోని బంకులు 5 కిలోమీటర్ల దూరంలో ఉండటం తో వినియోగదారులు అక్కడికి వెళ్లి పెట్రోల్‌  డీజిల్‌, తెచ్చుకుంటున్నారు. రైతులు ట్రాక్టర్లకు డీజిల్‌ను ఒక్కోసారి 150 లీటర్లు నుంచి 200 లీటర్లు తెచ్చు కుంటున్నారు. కర్ణాటకలో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ. 103.71 పైసలు, డీజిల్‌ ధర రూ.89.59పైసలు, ఆంధ్రలో పెట్రోల్‌ ధర. 110.06. డీజిల్‌ ధర. రూ. 98.86. ఉంది. డీజిల్‌పై లీటరుకు రూ.9.27పైసలు, పెట్రోల్‌పై లీటరుకు రూ.6.35 పైసలు రైతులకు మిగులుబాటు అవుతుండటంతో రైతు లు, వాహనదారులు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. ద్విచ క్ర వాహనాల్లోను, ట్రాక్టర్లలోను క్యాన్లలో డీజిల్‌, పెట్రోల్‌ ను తెచ్చుకుంటున్నారు. దీంతొ ఆంధ్ర సరిహద్దులోని పెట్రోల్‌ బంక్‌లకు గిరాకీ లేక మూతపడుతున్నాయి. మండలం లోని ఆదర్శ పాఠశాల వద్ద ఉన్న కార్తికేయ పెట్రోల్‌ బంక్‌, 67వ జాతీయ రహదారిలోని ఇసుక చెక్‌పోస్టు వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర పెట్రోల్‌ బంక్‌, డోనేకల్లులోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పెట్రోల్‌ బంక్‌ ఇలా మూతపడినవే. వాటిలో పని చేస్తున్న సిబ్బంది దాదాపుగా 50 కుటుంబాలకు పైగా వీధిన పడ్డాంుు. పెట్రోల్‌ బంక్‌ యజమానులు డొనేకల్లు గ్రామం వదిలి పట్టణాలకు చేరుకున్నారు.

Updated Date - 2022-09-24T05:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising