ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనపై ప్రజల ఆగ్రహం

ABN, First Publish Date - 2022-12-15T00:08:00+05:30

వైసీపీ అరాచక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

35, 36వ డివిజన్లల్లో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి..

అనంతపురం అర్బన, డిసెంబరు 14: వైసీపీ అరాచక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం అర్బన పరిధిలోని 35, 36వ డివిజన్ల పరిధిలో మాజీ కార్పొరేటర్‌ రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్ర మానికి ప్రభాకర్‌చౌదరి హాజరయ్యారు. రెండు డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వైసీపీ పాలనలో ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మూడేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా వితంతు పింఛన మంజూరు చేయ లేదని శాంతమ్మ, ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని భాగ్యమ్మ అనే మహిళలు వాపోయారు. పింఛన ఇప్పించాలని టిప్పుసుల్తాన అనే దివ్యాంగుడు వేడుకున్నాడు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జగన నిరంకుశ పాలన, అప్రజాస్వామిక, ప్రజావ్యతిరక విధానాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. కరెంటు బిల్లులు, ఇంటి గుత్త, గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతపురం అర్బనలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో చేసిందేమి లేదన్నారు. టీడీపీ కార్యక్రమానికి హాజరుకావద్దని స్థానిక వలంటీర్లతో ప్రజలను బెదిరిస్తున్నారని, బయటకు వస్తే పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సమస్యలను ఏకరువు పెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న, దేవళ్ల మురళి, తలారి ఆదినారాయణ, డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, మారుతీకుమార్‌ గౌడ్‌, కూచి హరి, దళవాయి వెంకటనారాయణ, గుర్రం నాగభూషణం, బంగి నాగ, ముక్తియార్‌, భాస్కర్‌నాయుడు, వెంకట సతీష్‌, శ్రీనివాసచౌదరి, స్వప్న, శివబాల, విజయశ్రీరెడ్డి, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising